Submit EPS e-Nomination and Secure 7 Lakh Insurance | EDLI Scheme - Sakshi
Sakshi News home page

ఈ-నామినేషన్ ఫైల్ చేశారా.. లేకపోతే రూ.7 లక్షలు రానట్లే?

Published Thu, Sep 2 2021 7:01 PM | Last Updated on Fri, Sep 3 2021 9:23 AM

EPFO: You Can Secure Up To RS 7 Lakh Insurance For Family Members - Sakshi

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) చందాదారులు కుటుంబాల‌కు సామాజిక ఆర్ధిక భద్రత కల్పించేందుకు కేంద్రం ఎంప్లాయిస్ డిపాజిట్‌-లింక్డ్‌ ఇన్సూరెన్స్ స్కీమ్‌ ను ప్రవేశపెట్టింది. ఈడీఎల్ఐ స్కీమ్ కింద చేరిన చందాదారులు మరణిస్తే ఆ తర్వాత నామినీకి గ‌రిష్ఠంగా రూ.7 ల‌క్ష‌లు వస్తాయి. అయితే, ఈ ప్ర‌యోజ‌నాన్ని పొందాలంటే ఈపీఎఫ్ చందాదారులు తప్ప‌నిస‌రిగా ఈ-నామినేష‌న్‌ ఫైల్ చేయాల‌ని ఇటీవ‌ల ట్విటర్ ద్వారా తెలిపింది. 

ఈ-నామినేషన్ కోసం ఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ ద్వారానే నామినేషన్ చేసుకునే అవకాశం ఈపీఎఫ్ఓ కల్పించింది. ఒకవేళ మీరు ఇంకా ఈ-నామినేషన్ దాఖలు చేయనట్లయితే దిగువన పేర్కొన్న విధంగా చేయవచ్చు. (చదవండి: ఈ-శ్రమ్ పోర్టల్‌లో పేరు రిజిస్టర్ చేసుకోవడం ఎలా?)

ఈ-నామినేషన్ ఫైలింగ్..

  • ‎‎ఈపీఎఫ్ఓ అధికారిక లింక్ పై క్లిక్ చేయండి. (https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/)
  • ‎‎యుఏఎన్, పాస్ వర్డ్'తో లాగిన్ అవ్వండి.‎
  • మీరు ఇంకా ఈ-నామినేషన్ చేయకపోతే మీకు పాప్ అప్ వస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి.
  • అలా కాకపోతే మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ‎ఈ-నామినేషన్ ఎంచుకోండి.‎
  • ఆ తర్వాత 'ఫ్యామిలీ డిక్లరేషన్' అప్ డేట్ చేయడం కొరకు అవును క్లిక్ చేయండి.‎
  • ఇప్పుడు ఒకరికన్న ఎక్కువ మంది కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించవచ్చు.  
  • వాటా మొత్తాన్ని నమోదు చేయడానికి 'నామినేషన్ వివరాలు' పై క్లిక్ చేయండి. ఆ తర్వాత 'సేవ్ ఈపీఎఫ్ నామినేషన్' మీద క్లిక్ చేయండి.‎
  • ఓటీపీ జెనెరేట్ చేయడం కొరకు 'ఈ సైన్' మీద క్లిక్ చేయండి. ఆధార్ తో లింక్ చేయబడ్డ మొబైల్ నెంబరుకు వచ్చిన 'ఓటీపీ'ని సబ్మిట్ చేయండి.‎
  • ఇప్పుడు ఈ-నామినేషన్ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement