ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) కింద రిజిస్టర్ చేసుకున్న ఉద్యోగులు ఇప్పుడు మెడికల్ అడ్వాన్స్ కింద లక్ష రూపాయల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగులు ఈ మొత్తాన్ని విత్ డ్రా చేయడానికి ముందు ఎటువంటి ఆసుపత్రి బిల్లుల సమర్పించాల్సిన అవసరం లేదు. సెంట్రల్ సర్వీసెస్ మెడికల్ అటెండెంట్(సీఎస్(ఎంఎ) నియమాలు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్ఎస్) కింద కవర్ అయ్యే ఉద్యోగులకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) విడుదల చేసిన సర్క్యులర్ లో పేర్కొంది. ఈ సేవలను ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఈ క్రింద తెలుసుకుందాం.
- నిబంధనల ప్రకారం రోగిని ప్రభుత్వ/పీఎస్ యు/సీజీహెచ్ఎస్ ఆసుపత్రిలో చేర్చాలి. ఒకవేళ రోగిని ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్చినట్లయితే, అప్పుడు ఒక అధికారి వివరాలను పరిశీలించిన అనంతరం దీన్ని మంజూరు చేస్తారు.
- ఉద్యోగి లేదా వారి కుటుంబం అడ్వాన్స్ క్లెయిం చేయడం కొరకు ఆసుపత్రి, రోగి వివరాలను తెలియజేస్తూ ఒక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. వారు దరఖాస్తులో బిల్లు అంచనాను రాయాల్సిన అవసరం లేదు.
- రోగి కుటుంబానికి ఈ డబ్బు అడ్వాన్స్‌గా ఇవ్వవచ్చు లేదా రోగిని చేర్చిన నిర్ధిష్ట ఆసుపత్రికి నేరుగా చెల్లించే అవకాశం ఉంది.
- ఒకవేళ చికిత్స బిల్లు లక్ష పరిమితిని మించితే మరోసారి అడ్వాన్స్ కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ సందర్భంలో ఆసుపత్రిలో వేసిన అంచనా బిల్లును సమర్పించాల్సి ఉంటుంది.
- రోగి డిశ్చార్జ్ అయిన 45 రోజుల్లోగా మెడికల్ బిల్లులు ఈపీఎఫ్ కు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment