
సాక్షి, హైదరాబాద్: కరోనా ఉపశమన పథకం (సీఆర్‌ఎస్) కింద కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐ) కార్డుదారులు మరణిస్తే వారి వేతనంలో 90 శాతం డబ్బును పింఛన్‌గా మృతుడి కుటుంబ సభ్యులకు అందజేస్తామని ఈఎస్‌ఐ కూకట్‌పల్లి బ్రాంచ్ మేనేజర్ షేక్ జిలానీ అహ్మద్ వెల్లడించారు.
ఈఎస్‌ఐ కార్డు సభ్యుడు జడల గణేశ్ ఇటీవల కరోనా కారణంగా మృతి చెందాడు. ఆయన కుటుంబ సభ్యులు సీఆర్‌ఎస్ పథకం కింద లబ్ధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఆర్‌ఎస్ పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ... సీఆర్‌ఎస్ పథకం కింద రాష్ట్రంలో మంజూరైన మొదటి పింఛన్ ఇదేనని స్పష్టం చేశారు. ఈఎస్‌ఐ కార్డుదారులు కరోనాతో చనిపోతే వారి కుటుంబ సభ్యులకు నిబంధనల ప్రకారం జీవితాంతం 90 శాతం పింఛన్ అందుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment