
న్యూఢిల్లీ: దీపావళి సందర్భంగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) చందాదారులు తమ ఖాతాను ఆధార్‌తో ఆన్‌లైన్లోనే అనుసంధానించుకునే అవశాన్ని కల్పించింది. యూనివర్సల్ అకౌంట్ నంబర్(యూఏఎన్) కలిగిన వారు ఈపీఎఫ్ ఇండియా పోర్టల్‌కు వెళ్లి అనుసంధానించుకోవచ్చు. ఇందుకోసం https:// iwu.epfindia.gov.in/eKYC/LinkUanAadhaar లింక్‌కు వెళ్లి యూఏఎన్, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ‘జనరేట్ ఓటీపీ’ని క్లిక్ చేయాలి. అప్పుడు సభ్యుల మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.
దాన్ని ఎంటర్ చేసి, కింది కాలమ్‌లో ఆధార్ నంబర్‌ను కూడా ఇచ్చి సబ్‌మిట్ చేయాలి. ఆ తర్వాత మరోసారి వారి మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి సబ్‌మిట్ చేయాలి. యూఏఎన్ వివరాలు, ఆధార్‌తో సరిపోలితే వెంటనే ఆధార్‌తో లింక్ అయిపోతుంది. దీంతోపాటు www.epfindia.gov.in సైట్‌కు వెళ్లి అక్కడ ఈకేవైసీ పోర్టల్‌ను ఎంచుకుని ఆధార్‌తో అనుసంధానం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment