
ఆన్‌లైన్ ద్వారా పీఎఫ్ నగదు విత్‌డ్రా
న్యూఢిల్లీ: ఇకపై ఉద్యోగులు ఆన్‌లైన్ ద్వారా పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకునే సదుపాయం కల్పించనున్నట్లు సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కేకే జలాన్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ మేరకు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈపీఎఫ్ నగదు తీసుకోవాలంటే ఉద్యోగికి.. సంస్థ అనుమతి తీసుకోవాలి. ఇకపై సంస్థతో సంబంధం లేకుండా నేరుగా ఉద్యోగి తన పీఎఫ్ మొత్తాన్ని పొందవచ్చు. అయితే ఉద్యోగి తన ఈపీఎఫ్ ఖాతాకు బ్యాంక్ అకౌంట్‌తో పాటు ఆధార్ నంబర్‌ను తప్పనిసరిగా జతచేసుకోవాలని జలాన్ సూచించారు. ప్రస్తుతం ఉన్న లిఖిత పూర్వక దరఖాస్తు విధానాన్ని పూర్తిగా మార్చి ఆన్‌లైన్‌ను ప్రవేశపెట్టనున్నామన్నారు.