న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)పై 8.65 శాతం వడ్డీ ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ విషయంలో తదుపరి చర్యలు చేపట్టేందుకు కార్మిక శాఖకు అనుమతినిచ్చింది. 2016-17కు గాను ఈ మేరకు వడ్డీని ఖరారు చేసిందని కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం ప్రకటించారు. దీనికి సంబంధించి అధికారిక చర్చలు ముగిసినట్టు త్వరలోనే ఒక ప్రకటన వెలువడుతుందని చెప్పారు. దాదాపు నాలుగుకోట్లమందికి ప్రయోజనం చేకూరనున్నట్టు మంత్రి తెలిపారు.
కాగా 8.65 శాతం చొప్పున వడ్డీ ఇచ్చేందుకు ఈపీఎఫ్ సంస్థ ట్రస్టీలు డిసెంబరులోనే ప్రతిపాదించారు. కేంద్ర ఆర్థిక శాఖ ఆ రేటు ఎక్కువగా ఉందన్న అభిప్రాయంతో ఇప్పటిదాకా నిర్ణయంఅమలును పెండింగ్ లోపెట్టిన సంగతి తెలిసిందే.
ఈపీఎఫ్‌పై 8.65 వడ్డీకి ఆర్థిక శాఖ ఆమోదం
Published Thu, Apr 20 2017 2:28 PM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM
Advertisement
Advertisement