Labour Minister Bandaru Dattatreya
-
ఈపీఎఫ్‌పై 8.65 వడ్డీకి ఆర్థిక శాఖ ఆమోదం
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)పై 8.65 శాతం వడ్డీ ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ విషయంలో తదుపరి చర్యలు చేపట్టేందుకు కార్మిక శాఖకు అనుమతినిచ్చింది. 2016-17కు గాను ఈ మేరకు వడ్డీని ఖరారు చేసిందని కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం ప్రకటించారు. దీనికి సంబంధించి అధికారిక చర్చలు ముగిసినట్టు త్వరలోనే ఒక ప్రకటన వెలువడుతుందని చెప్పారు. దాదాపు నాలుగుకోట్లమందికి ప్రయోజనం చేకూరనున్నట్టు మంత్రి తెలిపారు. కాగా 8.65 శాతం చొప్పున వడ్డీ ఇచ్చేందుకు ఈపీఎఫ్ సంస్థ ట్రస్టీలు డిసెంబరులోనే ప్రతిపాదించారు. కేంద్ర ఆర్థిక శాఖ ఆ రేటు ఎక్కువగా ఉందన్న అభిప్రాయంతో ఇప్పటిదాకా నిర్ణయంఅమలును పెండింగ్ లోపెట్టిన సంగతి తెలిసిందే. -
కింగ్‌ఫిషర్ పీఎఫ్ అవకతవకలపై విచారణ
కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ న్యూఢిల్లీ: తమకు జీతాలు చెల్లించకపోయినప్పటికీ, ప్రావిడెండ్ ఫండ్(పీఎఫ్)ను మాత్రం కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ చెల్లించిందని ఈ కంపెనీకి చెందిన మహిళ ఉద్యోగులు ఇటీవల రాసిన లేఖపై కేంద్రం దృష్టి సారిస్తోంది. కింగ్ ఫిషర్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కాలంలో ప్రావిడెండ్ ఫండ్ చెల్లింపుల్లో ఏమైనా అవకతవకలు జరిగాయా లేదా అన్న విషయమై దర్యాప్తు జరపుతామని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఈ విషయాలను పరిశీలించలేదని, తర్వలోనే దర్యాప్తు జరుపుతామని వివరించారు. కాగా కింగ్ ఫిషర్ కంపెనీ తమకు వేతన బకాయిలు చెల్లించలేదని పలువురు మాజీ ఉద్యోగులు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు.