ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) సంస్థలో గోల్ మాల్ జరిగింది. సంస్థ ఉద్యోగులే సుమారు రూ.1000 కోట్ల నిధిని కాజేసినట్లు తెలుస్తోంది. డమ్మీ కంపెనీలు, డమ్మీ ఫేక్ అకౌంట్‌లను క్రియేట్ చేసి అందులోకి నిధుల్ని మళ్లించారు. ఇందుకోసం జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు ఖాతాల్ని ఉపయోగించుకున్నట్లు తేలింది.
ముంబై సబర్బన్ ఉద్యోగులు ఈ కుంభకోణానికి పాల్పడినట్లు పలు కథనాలు వెలుగోలోకి వచ్చాయి. ఈ స్కాం ఎలా వెలుగులోకి వచ్చింది? ఎంత మంది నిధుల్ని కాజేశారనే విషయాలు వెలుగులోకి రావాల్సి ఉండగా.. ప్రస్తుతం ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు నిధుల దుర్వినియోగంపై ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బ్రోర్డర్ ఆఫ్ ట్రస్ట్రీ ప్రభాకర్ బాణాసురే స్పందించారు. ఉద్యోగుల తీరుతో ఈపీఎఫ్‌ఓ రూ.1000కోట్లు నష్టపోయే అవకాశం ఉందన్నారు. కాగా, ముంబైలోని కండివాలి కార్యాలయంలో ఈ మోసం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. విదేశాల్లో ఉన్న భారతీయులతో పాటు, జెట్ ఎయిర్‌వేస్‌లోని అప్పటి పైలట్లు, సిబ్బంది ఉద్యోగాలను ఉపయోగించడం ద్వారా స్కామ్ జరిగినట్లు సమాచారం.
చదవండి👉 ఈపీఎఫ్‌ఓలో ఫోటో ఎలా అప్‌లోడ్ చేయాలో తెలుసా? లేదంటే డబ్బులు రావు!
Comments
Please login to add a commentAdd a comment