ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ.. ఈపీఎఫ్‌వో 2015-16 సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీని తొమ్మిది శాతానికి పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ.. ఈపీఎఫ్‌వో 2015-16 సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీని తొమ్మిది శాతానికి పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 16న చెన్నైలో జరగనున్న ట్రస్టీల సమావేశంలో దీనిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. గత రెండేళ్లుగా పీఎఫ్‌పై సంస్థ 8.75శాతం వడ్డీ ఇస్తోంది. అయితే.. ఈపీఎఫ్‌వో సలహా సంఘం దీన్ని 8.95కి పెంచాలని సూచించింది.