
పీఎఫ్ నమోదుకు మరో అవకాశం
ఉద్యోగులు, కార్మికులు భవిష్యనిధి సభ్యులుగా ప్రయోజనాలను పొందేందుకు ఈపీఎఫ్‌వో ‘ఉద్యోగుల నమోదు ప్రచారం– 2017’ కార్య క్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్
సాక్షి: హైదరాబాద్: ఉద్యోగులు, కార్మికులు భవిష్యనిధి సభ్యులుగా ప్రయోజనాలను పొందేందుకు ఈపీఎఫ్‌వో ‘ఉద్యోగుల నమోదు ప్రచారం– 2017’ కార్య క్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ భవిష్యనిధి కమిషనర్ ఎంఎస్‌కేవీవీ సత్యనారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం మార్చి 31 వరకు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 2009 ఏప్రిల్ 1 నుంచి 2016 డిసెంబర్ 31 వరకు ఉద్యోగులు, కార్మికులుగా చేరి వివిధ కారణాలతో భవిష్యనిధి సదుపాయాలు పొందనివారు, ఆయా యాజమాన్యాలు స్వచ్ఛం దంగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు నమోదు చేసుకోనివారు అపరాధ రుసుము కింద ఏడాదికి రూ.1 చొప్పున నామమాత్రంగా చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. మిగతా వివరాలు http://epfo-hyd.ap.nic.inలో పొందవచ్చు.