'కేంద్ర మంత్రిగా ఏడాది పూర్తి'
కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా బండారు దత్తాత్రేయ ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన పీఎఫ్ డబ్బును 5శాతం ఈక్విటీ లో పెట్టాలని తీసుకున్ననిర్ణయం విప్లవాత్మక మైనదని గుర్తు చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా 7 కోట్ల 40 లక్షల మందికి పీఎఫ్ ఖాతాలు ఉన్నాయని తెలిపారు. బీడీ కార్మికులకు సెస్ పెంచాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. కార్మిక శాఖలో జరిగిన అవినీతికి సంబంధించి.. ఎలాంటి ఘటనలు తన దృష్టికి రాలేదన్నారు.