16న యూఏఎన్ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించనున్న ప్రధాని
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో)లోని 4 కోట్ల మందికిపైగా చందాదారులు ఈ నెల 16 నుంచి తమ భవిష్యనిధి ఖాతాల వివరాలను యథాతథంగా ఆన్‌లైన్‌లో పరిశీలించుకోవచ్చు. ఇందుకోసం ఈపీఎఫ్‌వో ఏర్పాటు చేసిన యూనివర్సల్ అకౌంట్ నంబర్(యూఏఎన్) వెబ్ పోర్టల్‌ను ప్రధాని మోదీ 16న ప్రారంభించనున్నారు. యాజమాన్యాలు పీఎఫ్ వాటాలను ప్రతి నెలా జమ చేస్తున్నాయా? లేదా? వంటి వివరాలను ఉద్యోగులు దీని సాయంతో తెలుసుకోవడం వీలవుతుంది. యూఏఎన్ అనేది పోర్టబుల్ ఖాతా కావడం వల్ల ఇకపై ఉద్యోగులు కంపెనీలు మారినా పీఎఫ్ ఖాతాల బదిలీకి దరఖాస్తు చేసుకోవాల్సిన అగత్యం తప్పనుంది.