పీఎఫ్ చందాదారులకు శుభవార్త | You Can Now Pay Home Loan EMIs From Provident Fund Deposits | Sakshi
Sakshi News home page

పీఎఫ్ చందాదారులకు శుభవార్త

Published Tue, Apr 25 2017 9:12 AM | Last Updated on Sun, Sep 2 2018 3:34 PM

పీఎఫ్ చందాదారులకు శుభవార్త - Sakshi

పీఎఫ్ చందాదారులకు శుభవార్త

న్యూఢిల్లీ: సుమారు నాలుగుకోట్లమంది  పీఎఫ్‌ చందాదారులకు శుభవార్త. ఇకనుంచి ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్‌) ఖాతా నుంచే నెలవారీ ఈఎంఐ చెల్లించుకునే సౌకర్యాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)  అందుబాటులోకి తెస్తోంది. అంతేకాదు ఈ ఖాతా నుంచే ప్రాథమిక చెల్లింపు(డౌన్‌ పేమెంట్‌)కోసం 90శాతం పీఎఫ్‌ విత్‌ డ్రా చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నట్టు  సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

కార్మిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ మేరకు ఇపిఎఫ్ఓ 1952 ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ (ఇపిఎఫ్) పథకాన్ని  సవరించింది. సవరణ ద్వారా  కొత్త పేరా - 68 బిడి చేర్చి  ఈ పథకాన్ని అందుబాటులోకి తేనుంది.  క్రొత్త నిబంధన ప్రకారం, ఒక ఈపీఎఫ్‌ చందాదారుడు సహకార లేదా హౌసింగ్ సొసైటీలో సభ్యులు కనీసం 10 మంది  తమ ఖాతా నిధుల నుంచి 90 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు.  నివాస గృహం లేదా ఫ్లాట్ లేదా నివాస గృహ నిర్మాణం  కోసం ఈ విత్‌ డ్రా చేసుకోవచ్చు.  దీంతోపాటుగా ప్రభుత్వం, హౌసింగ్ ఏజెన్సీ, ప్రాధమిక రుణసంస్థలు, బ్యాంకులకి సంబంధించిన రుణాలు, రుణాలపై ఇతర పెండింగ్‌ వడ్డీలను నెలవారీ వాయిదాలుగా చెల్లించేందుకు అనుమతినిస్తుంది.  
అయితే  ఈపీఎఫ్‌ఓ నిబంధనలకు లోబడి ఈ పథకం వర్తిస్తుంది.  ముఖ్యంగా  ఈ సదుపాయాలను  పొందాలంటే పీఎఫ్‌ ఖాతాలో కనీసం మూడేళ్లు కొనసాగాలి. అలాగే  ఈ సదుపాయం అతనికి లేదా ఆమెకి జీవితంలో ఒకసారి మాత్రమే  వినియోగించుకునే అవకాశం. జీవిత భాగస్వాములతో కలిసి ఉన్న వారి పీఎఫ్‌ ఖాతాలలో  రూ. 20వేల కనీస నిల్వ ఉండాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement