ఉపాధ్యాయుల ధర్నా రేపటికి వాయిదా | teachers dharna postponed | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల ధర్నా రేపటికి వాయిదా

Aug 22 2016 12:02 AM | Updated on Sep 2 2018 3:34 PM

ప్రావిడెంట్‌ ఫండ్‌ రుణాల మంజూరులో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 22న జిల్లా పరిషత్‌ ఎదుట చేయాలని నిర్ణయించిన ధర్నా 23వ తేదీకి వాయిదా వేసినట్టు ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జయకర్, బి.గోపీమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : ప్రావిడెంట్‌ ఫండ్‌ రుణాల మంజూరులో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 22న జిల్లా పరిషత్‌ ఎదుట చేయాలని నిర్ణయించిన ధర్నా  23వ తేదీకి వాయిదా వేసినట్టు ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జయకర్, బి.గోపీమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. అవకతవకలపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 4న నోటీసులు ఇచ్చినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో ధర్నా చేయాలని నిర్ణయించామన్నారు. 22న ప్రజావాణి కార్యక్రమం ఉన్నందున రేపటికి మార్చినట్టు తెలిపారు. ఉపాధ్యాయులు ఈ మార్పును గమనించి ధర్నాలో పాల్గొనాలన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement