
పీఎఫ్‌పై వడ్డీరేటును 8.65 శాతానికి పెంచినట్టు ఈపీఎఫ్‌ఓ ప్రకటించింది.
సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగులకు భవిష్యనిధి సంస్థ తీపికబురు అందించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)పై వడ్డీ రేటును 8.65 శాతానికి పెంచినట్టు ఈపీఎఫ్‌ఓ బుధవారం ప్రకటించింది. ఆరు కోట్ల మందికి పైగా చందాదారుల ఖాతాలపై రూ 54,000 కోట్ల మేర వడ్డీ జమ చేస్తామని ఈపీఎఫ్‌ఓ ట్వీట్ చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో భవిష్య నిధిపై 8.65 శాతం వడ్డీ రేటును ఈపీఎఫ్‌ఓ కేంద్ర ట్రస్టీల బోర్డు ఈ ఏడాది ఫిబ్రవరి 21న ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇక 2017-18లో గత ఐదేళ్లలో అత్యంత కనిష్టస్ధాయిలో 8.55 శాతం వడ్డీరేటును వర్తింపచేశారు.ఇక 2013-14లో ఈపీఎఫ్‌ఓ పీఎఫ్ ఖాతాలపై వడ్డీ రేటును 8.75 శాతం అందించింది.