న్యూఢిల్లీ: మృతిచెందిన ఉద్యోగులకు భవిష్యనిధిని వారి సంబంధీకులకు వీలైనంత త్వరగా అందించేలా ఒకే దరఖాస్తు నమూనా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) అందుబాటులోకి తెచ్చింది.
ఈ రకమైన విత్‌డ్రాయల్స్ కోసం ప్రస్తుతమున్న ఫారమ్ 20, 5–1ఎఫ్, 10–డీలను బదులుగా ఈ సంయుక్త దరఖాస్తు నమూనాను వినియోగించనున్నారు. ‘మృతిచెందిన ఉద్యోగి దాచుకున్న భవిష్యనిధి, బీమా నిధి, నెలవారి పింఛనును ఆయన సంబంధీకులకు అందించేలా.. ప్రస్తుతమున్న3 వేర్వేరు దరఖాస్తు ప్రతులకు బదులుగా ఒకే ప్రతిని అందుబాటులోకి తెచ్చాం’ అని ఈపీఎఫ్‌వో ఓ ప్రకటనలో తెలిపింది.