
చండీగఢ్: భవిష్యనిధి (పీఎఫ్) ఖాతాలోని మొత్తం డబ్బును చందాదారులు చిన్న చిన్న కారణాలతో విత్‌డ్రా చేసుకోవడం మంచిది కాదని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సూచించింది. ఖాతాలో నిరంతరం డబ్బు నిల్వ ఉన్నప్పుడే సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలు చందాదారులకు పూర్తిస్థాయిలో అందుతాయని ఈపీఎఫ్‌వో పేర్కొంది.
పీఎఫ్ ఖాతాను సాధారణ బ్యాంకు ఖాతాలాగ చూడకూడదనీ, సామాజిక భద్రతను అందించేందుకే పీఎఫ్ సొమ్ము ఉందని ఈపీఎఫ్‌వో తెలిపింది. చిన్న చిన్న కారణాలకు పీఎఫ్ డబ్బులను వాడుకోవడం వల్ల చందాదారులు జీవిత చరమాంకంలో ఇబ్బంది పడతారనీ, మొత్తం విత్‌డ్రాకు తాము వ్యతిరేకమని పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల కేంద్ర పీఎఫ్ కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఇప్పుడు పీఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బుతో చాలా సులభంగా రుణం పొందే అవకాశం కూడా ఉందనీ, ఉద్యోగులు దీనిని వినియోగించుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment