ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది ఆగస్ట్ 15 నుంచి తమ సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మళ్లించనున్నట్టు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) పేర్కొంది. రూ 10 లక్షలు మించిన పీఎఫ్ విత్‌డ్రాయల్స్‌కు విధిగా ఆన్‌లైన్‌లోనే క్లెయిమ్ చేయాలని స్పష్టం చేసింది. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ కింద రూ 5 లక్షలు దాటిన విత్‌డ్రాయల్స్‌కు ఆన్‌లైన్ క్లెయిమ్‌లను అనివార్యం చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం నాటికి పూర్తిగా ఆన్‌లైన్ సేవలు అందించాలని ఈపీఎఫ్‌ఓ లక్ష్యంగా నిర్ధేశించుకుంది.
ఈపీఎఫ్‌ఓ కార్యాలయాలన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. నూతన మార్పులకు అనుగుణంగా రాబోయే రెండు నెలల్లో కాగితరహిత సేవలపై పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని ఈపీఎఫ్‌ఓ నిర్ణయించింది. వాణిజ్య సంస్థలు, కంపెనీలు తమ ఉద్యోగుల పీఎఫ్ క్లెయిమ్‌లను విధిగా ఆన్‌లైన్‌లోనే చేపట్టాలని పేర్కొంది. అన్ని ఈ-కోర్టు కేసులనూ ఎలక్ర్టానిక్ ఫైలింగ్ ప్రక్రియలోనే ప్రాసెస్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తమ కార్యాలయాల్లో అవసరమైన మౌలిక వసతులను ఈపీఎఫ్‌ఓ అందుబాటులోకి తేనుంది.
Comments
Please login to add a commentAdd a comment