సొంతింటి కల నెరవేరుస్తాం | The dream of our own house will be fulfilled | Sakshi
Sakshi News home page

సొంతింటి కల నెరవేరుస్తాం

Published Tue, Aug 15 2017 2:32 AM | Last Updated on Sun, Sep 2 2018 3:34 PM

The dream of our own house will be fulfilled

పీఎఫ్‌ కేంద్ర కమిషనర్‌ వీపీ జాయ్‌ వెల్లడి 
 
సాక్షి, హైదరాబాద్‌: పీఎఫ్‌ ఖాతాదారులందరికీ సొంతింటి కల నెరవేరుస్తామని పీఎఫ్‌ కేంద్ర కమిషనర్‌ వీపీ జాయ్‌ తెలిపారు. ఇందుకు కనీసం పదిమంది ఖాతాదారులు ఒక బృందంగా ఏర్పాటు కావాలన్నారు. ఉద్యోగులు పీఎఫ్‌ కింద జమ చేసుకున్న మొత్తంలో గరిష్టంగా 90 శాతాన్ని రుణ రూపంలో ఇస్తామని, నెలవారీగా చెల్లించే పీఎఫ్‌ మొత్తాన్ని వాయిదాల కింద జమ చేసుకుంటామన్నారు.

ప్రస్తుతం ఈపీఎఫ్‌ పింఛన్‌దారుల సంఖ్య పెరుగుతోందని, అందువల్ల ప్రతి ఖాతాదారుడికి సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. సోమవారం పీఎఫ్‌ ప్రాంతీయాధికారి విజయ్‌ కుమార్‌తో కలసి మీడియాతో మాట్లాడారు. పీఎఫ్‌ ఖాతాకు ఆధార్‌ అనుసంధానానికి ఉద్యోగి పీఎఫ్‌ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement