
న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై ఈ ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతం వడ్డీనే కొనసాగించే అవకాశాలున్నాయి. నేడు(బుధవారం) జరిగే సమావేశంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌ఓ) ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని సమాచారం. ఈపీఎఫ్‌ఓ ఈ నెలలో ఈటీఎఫ్‌లపై రూ.1,054 కోట్ల రాబడులు సాధించిందని దీంతో ఈ ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతం వడ్డీరేటును ఇవ్వడం సాధ్యమవుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
వడ్డీరేట్లపై నిర్ణయంతో పాటు నిర్వహణ చార్జీలను 0.65 శాతం నుంచి 0.50 శాతానికి తగ్గించే ప్రతిపాదనపై కూడా నేటి సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. ఈపీఎఫ్‌ఓ 2015 ఆగస్టు నుంచి ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. ఇప్పటివరకూ రూ.44,000 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఇప్పటివరకైతే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను విక్రయించలేదు. ఇప్పటివరకైతే ఈటీఎఫ్‌లపై 16 శాతం రాబడి వచ్చింది. కాగా గత ఆర్థిక సంవత్సరంలో వడ్డీరేటు 8.8 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment