ఏటీఎం కార్డు లేకున్నా డబ్బులు విత్‌డ్రా | money withdrawal without atm card in warangal district | Sakshi
Sakshi News home page

ఏటీఎం కార్డు లేకున్నా డబ్బులు విత్‌డ్రా

Published Tue, Dec 22 2015 2:34 PM | Last Updated on Sun, Sep 3 2017 2:24 PM

money withdrawal without atm card in warangal district

నర్మెట : బ్యాంకు అధికారులు ఏటీఎం కార్డులు జారీ చేయకున్నా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా అయినట్లు ఖాతాదారుల సెల్‌కి మెసేజ్ వచ్చిన సంఘటన వరంగల్ జిల్లాలో మంగళవారం జరిగింది. జిల్లాలోని నర్మెట మండలంలోని ఎల్లండ గ్రామానికి చెందిన దొండకాయల గట్టయ్య బ్యాంక్ అఫ్ బరోడా నర్మెట శాఖలో ఖాతా తెరిచాడు. అతనికి బ్యాంకు అధికారులు ఇప్పటివరకు ఏటీఎం కార్డు జారీ చేయలేదు. అయితే అకౌంట్ నుంచి రూ. 1800 ఏటీఎం ద్వారా విత్‌డ్రా అయినట్లు ఆయన సెల్‌కు ఓ మెసేజ్ వచ్చింది.

అదే విధంగా అదే గ్రామానికి చెందిన పంతెంగి లక్ష్మయ్య ఖాతా నుంచి కూడా 900 విత్‌డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. వీరిద్దరికి ఏటీఎం కార్డులు జారీ చేయకుండా శాతాల నుంచి డబ్బులు డ్రా చేయడం ఏమిటని వారు బ్యాంక్ అధికారులను నిలదీశారు. అయితే సంఘటనపే విచారణ చేస్తున్నామని బ్యాంక్ అధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement