కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే పంచాయతీ ఎన్నికలను పార్టీ గుర్తుతో నిర్వహించేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఈరోజు ఆమె ఆముదాలవలస నియోజకవర్గంలో నడిచారు. సాయంత్రం ఆముదాలవలసలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. తెలుగు దేశం పార్టీకి ధైర్యం ఉండుంటే పంచాయతీ ఎన్నికలను పార్టీ గుర్తుల మీద నిర్వహించాలని డిమాండ్ చేసి ఉండేదన్నారు. ఆమె ప్రసంగంలో కాంగ్రెస్, టిడిపిలపై మండిపడ్డారు. బహిరంగ సభకు అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఆమె ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. సభా ప్రాంగణం జగన్ నినాదాలతో మార్మోగిపోయింది.