
ఎవరీ బాలుడు?
పాలకొండ : పట్టణంలో పాలకొండ-శ్రీకాకుళం రహదారిలో శుక్రవారం సాయంత్రం నుంచి అయోమయంగా తిరుగుతున్న ఈ బాలుడు ఎవరో తెలియరాలేదు. సుమారు నాలుగు సంవత్సరాలు వయస్సు ఉన్న ఈ బాలుడు పేరు సిద్దూ అని, తండ్రి బంగారు, తల్లి సుధారాణి అని చెబుతున్నాడు. వచ్చిరాని మాటలతో తమది సీతంపేట అని చెబుతున్నాడు.
రహదారిలో ఏడస్తూ తిరుగుతున్న ఈ బాలుడుని బూర్జ వీఆర్వో జడ్డు నీలకంఠం గుర్తించి చేరదీశారు. ఆచూకీ కోసం పాలకొండ, బూర్జ, సీతంపేట పోలీసుస్టేషన్‌లలో సంప్రదించినా ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు. దీంతో బాలుడుని వారి సంరక్షణలోనే ఉంచారు. బాలుడుని గుర్తించిన వారు పాలకొండ పోలీసుస్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.