వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యం
Published Thu, Jan 2 2014 4:19 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
పాలకొండ, న్యూస్‌లైన్: ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని విజయపథంలో నడిపించడమే తన ముందున్న లక్ష్యమని ఆ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం పేర్కొన్నారు. పాలవలస 69వ జన్మదిన వేడుకలను బుధవారం ఆయన స్వగృహంలో నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు కేక్‌ను కట్ చేసి నూతన సంవత్సర, జన్మదిన వేడుకలను ఆయన ప్రారంభించారు. ఆయనను అభినందించేందుకు వచ్చిన వీఐపీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో ఇంటి పరిసరాలు కిక్కిరిసిపోయాయి. జన్మదిన వేడుకలను రాజశేఖరం సతీమణి, పాలకొండ జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు పాలవలస ఇందుమతి, పాలకొండ నియోజకవర్గ సమన్వయకర్తలు పాలవలస విక్రాంత్, విశ్వాసరాయి కళావతి, పాలవలస ధవళేశ్వరరావు పర్యవేక్షించారు. రాజశేఖరానికి పుష్పగుచ్ఛాలు, దుశ్శాలువలతో అభిమానులు జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పార్టీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ చందక జగదీష్‌కుమార్‌తో పాటు పార్టీకి చెందిన పాలకొండ డివిజన్‌లోని అన్ని మండలాల కన్వీనర్లు, జిల్లా కమిటీ సభ్యులు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement