జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం
పినపెంకి(బాడంగి): వచ్చే సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరదరామారావు (రాంబాబు) కార్యక్తర్తలకు పిలుపునిచ్చారు. తన స్వగ్రామం పినపెంకిలో మంగళవారం జరిగిన పార్టీ మండల విస్తృత స్థాయి సమావేçశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల గుంటూరులో జరిగిన జాతీయ స్థాయి ప్లీనరీలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఎమ్మెల్సీ, పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కోలగట్ల వీరభద్రస్వామి, పార్టీ జిల్లా వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావులు మాట్లాడుతూ బొబ్బిలి రాజులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడి రాజుల గౌరవాన్ని మంటగలిపారన్నారు. పార్టీ కార్యకర్తలెవరూ భయపడాల్సిన పనిలేదని, ఏ కష్టమొచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో పాలనను గాలికొదిలి అవినీతి, అక్రామార్జన కోసం వెంపర్లాడుతున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడని విమర్శించారు. చంద్రబాబు దోచుకుంటుంటే ఆయన కుమారుడు లోకేష్ దాచుకొంటున్నాడని ఆరోపించారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖరరావు మాట్లాడుతూ బూత్, సంస్థాగత కమిటీలు వేసి పార్టీని పటిష్టం చేయాలన్నారు. గెలుపే ప్రతికార్యకర్త లక్ష్యం కావాలని సూచించారు. పార్టీ జిల్లా పరిశీలకుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్వశక్తిపై సీఎం కాలేదని, ఓ సారి మామకు వెన్నుపోటు పొడిచి, మరోసారి వాజ్‌పేయ్, ఇప్పుడు మోదీని అడ్డుపెట్టుకొని సీఎంగా గెలుపొందారని గుర్తుచేశారు. జిల్లాలో పటిష్టత కలిగిన నాయుకులున్నారని, అనుభవం కలిగిన మాజీ మంత్రి బొత్స జగన్‌కు అండగా ఉన్నారని, జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లోనూ విజయం తథ్యమన్నారు.
అందరూ సమిష్టిగాపనిచేస్తే మనదే విజయమని వైఎస్సార్‌సీపీ బొబ్బిలి నియోజకవర్గ సమన్వయకర్త పోల అజయ్‌కుమార్ అన్నారు. సమావేసంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరాములునాయుడు, ఎంఎల్‌ఎన్ రాజు, బొబ్బిలి మున్సిపల్ మాజీ చైర్మన్ ఇంటిగోపాలరావు, బాడంగి మాజీ సర్పంచ్ పెద్దింటి రామారావు, ఆవు సత్యనారా యణ, కోటిపల్లి ఎంపీటీసీ సభ్యుడు మార్పిన శ్రీనువాసరావు, రాజాన చిన్నయ్య అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీలో 150 కుటుంబాలు చేరిక
పినపెంకిలో జరిగిన పార్టీ మండలస్థాయి విస్తృతస్థాయి సమావేశంలో కోటిపల్లి టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు మార్పిన శ్రీనివాసరావుతో పాటు కోటిపల్లి, వాడాడ, రేజేరు, బొత్సవానివలస, హరిజనపాల్తేరు, ఆనవరం, పీవీ పేట, జీకేఆర్ పురం తదితర గ్రామాలకు చెందిన 150 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. వీరిలో మాజీ సర్పంచ్‌లు, వైస్ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఉన్నారు. కోటిపల్లి ఎంపీటీసీ సభ్యుడు శ్రీను, వాడాడకు చెందిన పూడి జగధీశ్వరరావు, రేజేరుకు చెందిన రేజేటి చిన్నయ్య, ఆనవరానికి చెందిన ఈదుబిల్లి అప్పలనాయుడు, పి.వెంకంపేటకు చెందిన మూడడ్ల వెంకటరమణ, జీకేఆర్ పురానికి చెందిన పిన్నింటి కృష్ణ, బొత్సవానివలస గ్రామ నాయకులు, హరిజన పాల్తేరుకు చెందిన అలజంగి కిరణ్ ఆధ్వర్యంలో అధిక కుటుంబాలు వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వీరికి పార్టీ కండువాలు వేసి నాయకులు ఆహ్వానించారు.