శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. శుక్రవారం పాలకొండ మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ పంక్షన్ హాల్‌లో నియోజకవర్గ సమావేశం జరిగింది.
పాలకొండ (శ్రీకాకుళం జిల్లా): శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. శుక్రవారం పాలకొండ మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ పంక్షన్ హాల్‌లో నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షురాలు శిరీష, నియోజకవర్గ ఇన్చార్జ్ జైకృష్ణ ఇతర పార్టీ నాయకులు హాజరయ్యారు.
కాగా నియోజకవర్గ ఇన్చార్జ్ ఏకపక్ష తీరును ఆ పార్టీ కార్యకర్తలు అధ్యక్షురాలి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పార్టీ జిల్లా అధ్యక్షురాలి సమక్షంలోనే జైకృష్ణ వర్గం..ఇతర పార్టీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాల తెలుగు తమ్ముళ్లను శాంతపరిచారు.