రాజాం, పాలకొండ రూరల్: రాష్ట్ర శాసనసభకు సంబంధించిన పలు కమిటీల్లో జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యం లభించింది. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిర్ణయం మేరకు ఈ నియామకాలు జరిగాయి. షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) లెజిస్లేటివ్ కమిటీ సభ్యుడిగా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులును నియమించారు. ఈ కమిటీలో ఆయనతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలను నియమించారు. రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను ఈ కమిటీ పర్యవేక్షించి అసెంబ్లీ నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే మహిళాశివు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమానికి 11 మంది సభ్యులతో నియమించిన లెజిస్లేటివ్ కమిటీలో పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతికి చోటు లభించింది. ఈ కమిటీలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి తమకు అప్పగించిన శాఖలకు సంబంధించిన పథకాల అమలు తీరు, లోటుపాట్లు పరిశీలిస్తాయి.
అసెంబ్లీ కమిటీల సభ్యులుగా మన ప్రతినిధులు
Published Wed, Mar 11 2015 2:12 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM
Advertisement
Advertisement