మీ సేవా కేంద్రాల్లోనూ రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ | mee save centers, the adoption of ration card applications | Sakshi
Sakshi News home page

మీ సేవా కేంద్రాల్లోనూ రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ

Published Wed, Aug 6 2014 2:40 AM | Last Updated on Mon, Oct 8 2018 7:48 PM

మీ సేవా కేంద్రాల్లోనూ రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ - Sakshi

మీ సేవా కేంద్రాల్లోనూ రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ

 పాలకొండ: తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేసే ప్రక్రియను సరళతరం చేసే క్రమంలో మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పిస్తున్నట్టు జిల్లా పౌరసరఫరాల అధికారి(డీఎస్‌వో) సిహెచ్.ఆనంద్‌కుమార్ చెప్పారు. మంగళవారం ఆయన పాలకొండ తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి స్థానిక అధికారులతో సమీక్షించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకొనేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నామన్నారు.
 
 జిల్లాలో ఆధార్ నమోదు 80 శాతం పూర్తయిందని, ఈ నెల 15లోగా శతశాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాజాం జీఎంఆర్ కళాశాలలో ఫీడింగ్ ప్రక్రియ శరవేగంతో కొనసాగుతోందన్నారు. వంగర, పొందూరు మండలాల్లో ఆధార్ నమోదు ప్రక్రియ వేగవంతం చేసేందుకు అధికారులను అప్రమత్తం చేస్తున్నామన్నారు. అంతకుముందు ఆయన పాలకొండ మండలంలో తూకాల్లో తేడావస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఆరా తీశారు. తహశీల్దార్ కె.రామకృష్ణ, సీఎస్ డీటీ సరోజిని నుంచి వివరాలు సేకరించారు. తూకంలో తేడాలేకుండా తరచూ తనిఖీలు చేయాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
Advertisement