పాలకొండ (శ్రీకాకుళం): జన్మభూమి కమిటీలపై వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కోర్టును ఆశ్రయించినట్టు ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శనివారం శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం నివాసానికి ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జన్మభూమి కమిటీల వల్ల అన్యాయానికి గురైనవారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకొస్తే వారి తరఫున పార్టీయే న్యాయ పోరాటం చేస్తుందన్నారు.