పాలకొండలో రూ.4.49 లక్షలు స్వాధీనం
Published Wed, Mar 12 2014 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 AM
పాలకొండ రూరల్, న్యూస్‌లైన్ : ఎన్నికల నేపథ్యంలో పాలకొండ లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద మంగళవారం రాత్రి జరిపిన తనిఖీల్లో వేర్వేరు వ్యక్తుల నుంచి రూ.4.49 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాలకొండ-విశాఖపట్నం రహదారిలో వైఎస్సార్ కూడలి వద్ద ఉన్న చెక్‌పోస్టు మీదుగా ద్విచక్ర వాహనంపై పాలకొండ నుంచి విజయనగరం వెళ్తున్న పురోహిత్ నాగరాజు అనే వ్యాపారి ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.2.80 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పాలకొండ నుంచి విశాఖపట్నం వెళుతున్న సత్యవరపు నాగేశ్వరరావు అనే మరో వ్యాపారి వద్ద ఉన్న రూ.1.69 లక్షల నగదును కూడా స్వాధీ నం చేసుకున్నారు. వీరిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రశ్నిం చారు.
ఎన్నికల నేపథ్యంలో ఇంత సొమ్ము తీసుకెళ్లడం అపరాధమ ని, సొమ్ముకు సంబంధించిన బిల్లులను చూపాలని సూచిం చారు. జిల్లా లో వ్యాపారం నిమిత్తం ఇచ్చిన అప్పులను వసూలు చేసుకుని తీసుకువెళుతున్నామని వ్యాపారులు చెప్పారు. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపపోవటంతో రెవెన్యూ కోర్టులో కేసులు నమోదు చేశారు. నగదును రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎసై్స చం ద్రశేఖర్ ఏలాం కూడలి చెక్‌పోస్టు వద్ద తని ఖీలను మరింత కట్టుదిట్టం చేశారు. ఎన్నికల డీటీ మూర్తి, రెవెన్యూ సిబ్బంది చంద్రశేఖర్, సరోజిని పాల్గొన్నారు.
Advertisement
Advertisement