శ్రీకాకుళం జిల్లా పాలకొండలో కుక్కలు భీభత్సం సృష్టించాయి.
పాలకొండ: శ్రీకాకుళం జిల్లా పాలకొండలో కుక్కలు భీభత్సం సృష్టించాయి. పట్టణంలోని మేదర వీధి, వెంకటరాయుని కోనేరు దరి ప్రాంతాల్లో కుక్కలు దాడి చేసి 15 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 10 మంది విద్యార్థులు ఉన్నారు. క్షతగాత్రులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా కుక్కల బెడదతో పట్టణ వాసులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడే పరిస్థితి నెలకొంది.