జీవితాంతం తోడుంటానన్న పెళ్లినాటి ప్రమాణాలు మరిచాడు.. జీవిత చరమాంకంలో..కొడుకు, కోడలు, మనుమరాళ్లతో హాయిగా గడపాల్సిందిపోయి.. కిరాతకుడిగా మారాడు..కట్టుకున్న భార్యనే కడతేర్చాడు.
రోకలితో మోది భార్యను హత్యచేసిన భర్త
Sep 26 2013 3:54 AM | Updated on Sep 2 2018 4:46 PM
జీవితాంతం తోడుంటానన్న పెళ్లినాటి ప్రమాణాలు మరిచాడు.. జీవిత చరమాంకంలో..కొడుకు, కోడలు, మనుమరాళ్లతో హాయిగా గడపాల్సిందిపోయి.. కిరాతకుడిగా మారాడు..కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఒళ్లు గగుర్పొడిచే.. ఈ సంఘటన పాలకొండ పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
పాలకొండ, న్యూస్‌లైన్: పాలకొండ నగర పంచాయతీ పరిధి మురళీ మోహన్‌నగర్ కాలనీ మూడోలైన్‌లో నివాసముంటు న్న మద్ది కామేశ్వరరావు తన భార్య లక్ష్మి(50)ని బుధవారం తెల్లవారు జామున కిరాతకంగా హత్య చేశాడు. నిద్రిస్తున్న ఆమెపై రోకలితో చనిపోయేంత వరకు మోదాడు. వెంటనే కుటుంబ సభ్యులు పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించినా..అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కామేశ్వరరావు తాపీమేస్త్రీగా పనిచేసుండేవాడు. మద్యం అలవాటు ఉంది. కుమారుడు చిరంజీవి వంగర స్టేట్‌బ్యాంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. కోడలు కూడా ఉద్యోగి కావడంతో.. అంతా కలిసిమెలిసి ఒకే ఇంటిలో నివాసముంటున్నారు. మంగళవారం రాత్రి చిరంజీవి, అతని భార్య ఇంటిలో ఓ గదిలో నిద్రపోగా, కామేశ్వరరావు, లక్ష్మి, కుమార్తె జయశ్రీ, మనుమలు మెయిన్ హాల్‌లో నిద్రపోయారు. తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో పెద్ద శబ్ధం, కేకలు వినిపించడంతో అందరూ ఒక్కసారి నిద్రలేచారు.
అప్పటికే లక్ష్మి మంచంపైన రక్తపు మడుగులో ఉండగా, దాడి చేసిన భర్త కామేశ్వరరావు కొద్ది క్షణాల్లో అక్కడ నుంచి నిష్ర్కమించాడు. ఆ తర్వాత ఇరుగుపొరుగువారి సహాయంతో పాల కొండ ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆమె మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. దాడికి ఉపయోగించిన రోకలిని అక్కడే విడిచిపెట్టి భార్యను హతమార్చానన్న పశ్చాత్తాపం ఏ మాత్రం లేకుండా తన తండ్రి వెళ్లిపోయినట్టు పిల్లలు చిరంజీవి, జయశ్రీ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ చెప్పారు. రాత్రి ఎటువంటి గొడవ జరగలేదన్నారు. ఘటనా స్ధలం రక్తపు మడుగుగా మారిపోయింది. దెబ్బలు గట్టిగా తగలడం.. లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది.
వేరు కాపురం పెట్టనందుకే...
తాపీమేస్త్రీగా పనిచేస్తూ సంపాదించిన కూలి డబ్బును ఇంటికి ఇవ్వకుండా మద్యానికి కామేశ్వరరావు బానిసయ్యాడు. దీంతో కుమారుడు, కోడలుతో పాటు భార్య లక్ష్మి కూడా ఇకపైన పనికి వెళ్లవద్దని, ఇంటిలోనే ఉంటే అన్ని సదుపాయాలు చూసుకుంటామని కోరా రు. దీంతో ఇంటికే పరిమితమయ్యాడు. ఇంటిలో వ్య సనాల జోలికి వెళ్లకుండా కట్టడి చేయడంతో స్వేచ్ఛను కోల్పోయానన్న భావనతో భార్య లక్ష్మిని వేరు కా పురం రావాలని కోరాడు. ఈ వయస్సులో పిల్లలు, మనుమల బాగోగులు చూసుకోకుండా వేరు కాపురం ఏమిటని భార్య నిరాకరించడంతో తన స్వగ్రామమైన పాతపట్నం మండలం పెద్దసీదిలోని గ్రామ పెద్దలను ఆశ్రయించాడు. వారు చెప్పినా కూడా వేరు కాపురం ఉండేందుకు లక్ష్మి సుముఖత చూపలేదు. దీంతో తీవ్ర మానసిక సంఘర్షణకు గురై ఆమె ఉసురు తీశాడు.
అంతా శోకసంద్రం
కళ్లెదుటే తల్లి విగతజీవిగా మారడంతో కుమారుడు చిరంజీవి, ఎనిమిదో తరగతి చదువుతున్న కుమార్తె జయశ్రీ, బంధవులు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎన్.హెచ్.విజయానంద్, ఎస్సై ఎం.వినోద్‌బాబు, ప్రొబేషన్ ఎస్సై అప్పలనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని వివరా లు తెలుసుకున్నారు. నిందితుని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. లక్ష్మి మృతదేహానికి ఏరి యా ఆస్పత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించారు. ఎస్సై వినోద్‌బాబు కేసు నమోదు చేయగా సీఐ విజయానంద్ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement