ఎమ్మెల్యేలను లాక్కోవడమే మీ పనా..?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాలకొండ ఎమ్మెల్యే కళావతి
సీతంపేట: ఎమ్మెల్యేలను లాక్కోవడానికే ప్రభుత్వం సమయమంతా ఖర్చు చేస్తోందని, ప్రజా సమస్యలు గాలికి వదిలేస్తోందని పాలకొండ ఎమ్మెల్యే కళావతి ఘాటుగా విమర్శించారు. ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కరువు మండలాలను ప్రకటించి నెలలు గడుస్తున్నా ఎలాంటి పరిహారం అందలేదని తెలి పారు. కనీసం ఎన్టీఆర్ జలసిరిలో తీస్తామన్న బోర్లు కూడా తీయలేదని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్లో అక్రమాలు జరిగాయని ఆరుగురు ఏజెన్సీ ఎమ్మెల్యేలం ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.
ఐటీడీఏ టీఎస్‌పీ పరిధిలో వెలు గు, యూత్‌ట్రైనింగ్ కేంద్రాలకు కంప్యూటర్లు, వివిధ రకాల మెటీరియల్ కొనుగోలులో లక్షలాది రూపాయల అ వినీతి జరిగినా దర్యాప్తు చేయకపోవ డం అన్యాయమన్నారు. ఉపకార వేతనా ల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయన్నారు. దీనిపై సీబీసీఐడీ ద ర్యాప్తు చేయాలన్నారు. ఎస్‌డీఎఫ్ జి ల్లాకు నిధులు రూ.50 కోట్లు కేటాయిస్తే ఇంతవరకు దాన్ని 10 నియోజకవర్గాలకు ఎలా పంపిణీ చేశారో చెప్ప డం లేదన్నారు. స్పోర్ట్స్ పాఠశాల ఎచ్చెర్లలో నిర్మిస్తామని, ఇప్పుడు లంబసిం గిలో పెడతామనడం ఎంతవరకు సమంజసమన్నారు. జన్మభూమి కమిటీల ద్వారా వృద్ధులు, వితంతువుల పింఛన్లను కూడా తీసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.