mla kalavathi
-
ఈ పదవి సీఎం జగన్ ఇచ్చిన వరం: ఎమ్మెల్యే కళావతి
దశాబ్దాలుగా వెనుకబడిన పాలకొండ నియోజకవర్గ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యేగా తనకొక అవకాశం లభించిందని, ఈ పదవి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన వరమని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఇరిగేషన్... ఇలా అన్ని రంగాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే పాలకొండ నియోజకవర్గ అభివృద్ధికి ముందడుగు పడిందని అభిప్రాయపడ్డారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పలు అంశాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘‘వైఎస్సార్సీపీ అభ్యర్థిగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో 1,680 ఓట్లతో, మళ్లీ 2019 ఎన్నికల్లో సుమారు 18,700 ఓట్లతో పాలకొండ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు. దశాబ్దాలుగా ఎంతో వెనుకబడి ఉన్న ఈ ప్రాంత అభివృద్ధికి నా వంతు పాత్ర పోషించడానికి ఇలా ఒక అవకాశం వచ్చింది. ఇది వైఎస్సార్సీపీ అధినాయకుడు ఇచ్చిన వరం. ఆయన ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చినప్పటి నుంచి నవరత్నాల్లాంటి సంక్షేమ పథకాలను నిరాటకంగా అమలు చేస్తున్నారు. మరోవైపు పాలకొండ వంటి వెనుకబడిన ప్రాంతాలపై దృష్టి పెట్టారు. తోటపల్లి ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు నిధులు మంజూరు చేయడం అందులో భాగమే. ఇదే ప్రాజెక్టు అభివృద్ధి పేరుతో గత టీడీపీ ప్రభుత్వం రూ.153 కోట్ల మంజూరు చేసింది. కానీ తెరవెనుక దోచుకునే మంత్రాంగం నడిపారు అప్పటి టీడీపీ నాయకులు. నీరు – చెట్టు పథకం కింద చేపట్టేందుకు ఖండఖండాలుగా పనులను విభజించారు. అదృష్టవశాత్తూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఇంటికి పంపించడంతో ఆ కుట్ర కాస్తా నిలిచిపోయింది. సైఫన్ ముసుగులో టీడీపీ దోపిడీ వీరఘట్టం మండల రైతుల సాగు భూములకు నీరు అందించే సైఫన్ 2016 సంవత్సరంలో దెబ్బతింది. దీన్ని బాగుచేయడానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.80 లక్షలు మంజూరుచేసింది. ఆ నిధులనూ టీడీపీ నాయకులు దోపిడీ చేశారు. ఈ సైఫన్ స్థానంలో ఆక్వాడెక్ట్ నిర్మించడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంకల్పించింది. తోటపల్లి పాత ఆయకట్టు ఆధునికీకరణలో భాగంగా త్వరలోనే పనులు ప్రారంభంకానున్నాయి. ప్రజల చెంతకు వైద్యసేవలు వెనుకబడిన ప్రాంతంలో వైద్య రంగాన్ని బాగు చేయాలనే ప్రయత్నం గత టీడీపీ ప్రభుత్వంలో ఏనాడూ జరగలేదు. పాలకొండ ఏరియా ఆస్పత్రి ఆధునికీకరణకు, వైద్య పరికరాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.7.50 కోట్లనూ దుర్వినియోగం చేశారు. శ్రీకాకుళంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ (రిమ్స్)ను ప్రారంభించిన సమయంలోనే నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేద, బడుగు, గిరిజనులు ఎక్కువగా ఉన్న పాలకొండ డివిజన్ కోసం జిల్లా ఆస్పత్రిని మంజూరు చేశారు. కానీ గత టీడీపీ ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు తన టెక్కలి నియోజకవర్గానికి మార్చేసుకున్నారు. ఈ విషయాలన్నీ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాను. నాడు–నేడు కార్యక్రమంలో పాలకొండ ఏరియా ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయడానికి హామీ ఇచ్చారు. రూ.5 కోట్ల వరకూ వెచ్చిస్తే సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ప్రజల చెంతకు తీసుకురావచ్చు. ఇప్పటికే సీతంపేట సీహెచ్‌సీని ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేశారు. ఇక్కడ ప్రతిరోజూ వంద నుంచి 150 వరకూ ఓపీ ఉంటోంది. ఇక రూ.50 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మంజూరు చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మరోవైపు పీహెచ్‌సీలన్నీ బాగు చేశారు. అదనపు భవనాలను నిర్మించారు. స్పెషలిస్టు వైద్యులను నియమించారు. గ్రామాల్లో కొత్తగా 63 ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తేవాలనేది లక్ష్యం. వాటి నిర్మాణానికి రూ.11.38 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వాటిలో 13 గ్రామ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం పూర్తి అయ్యింది. మిగిలిన వాటి పనులు శరవేగంతో జరుగుతున్నాయి. వైద్యసేవల కోసం గతంలో కనీవినీ ఎరుగనిరీతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టి పెట్టడం పాలకొండ ప్రాంత ప్రజల అదృష్టం. ఎన్నో శాశ్వత అభివృద్ధి పనులు ప్రజలకు ప్రభుత్వ సేవలను వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో చేరువయ్యాయి. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు దాదాపు రూ.34.64 కోట్ల అంచనా వ్యయంతో 93 గ్రామ సచివాలయాలకు శాశ్వత భవనాలను మంజూరు చేశాం. వాటిలో 40 భవనాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. మిగతా భవనాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 93 వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకేల)కు శాశ్వత భవనాలను మంజూరు చేశాం. వీటి నిర్మాణానికి రూ.21.25 కోట్ల వ్యయమవుతోంది. వాటిలో ఇప్పటికే 21 భవనాల నిర్మాణం పూర్తి అయ్యింది. మిగతా వాటి పనులూ పురోగతిలో ఉన్నాయి. ఎంపీల్యాడ్ నిధులు అరకు ఎంపీ గొడ్డేటి మాధవి కోటా నుంచి మంజూరయ్యాయి. రూ.31 లక్షలతో మూడు బస్ షెల్టర్లు, 22 రచ్చబండ పనులు చేపట్టాం. ఆ పనులన్నీ పురోగతిలో ఉన్నాయి. జీజీఎంపీ గొప్ప కార్యక్రమం గడప గడపకూ మన ప్రభుత్వం అనేది జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన గొప్ప కార్యక్రమం. సాంకేతిక కారణాల వల్ల ప్రజల్లో ఎవరికై నా పథకాలు అందకపోయినా, మరే సమస్యలు ఉన్నా వలంటీరు వ్యవస్థ ద్వారా గుర్తిస్తున్నాం. క్షేత్ర స్థాయిలో వాటిని వెనువెంటనే పరిష్కరిస్తున్నాం. ప్రతి సచివాలయం పరిధిలో రూ.20 లక్షల చొప్పున నిధులు వస్తున్నాయి. కానీ ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం ఇక్కడి అవసరాలు, పరిస్థితుల దృష్ట్యా రూ.40 లక్షల చొప్పున పెంచడం విశేషం. జగనన్నకు చెబుదాం కార్యక్రమం కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతున్న గొప్ప కార్యక్రమం.’’ గిరిజనులకు వరాల మూట ప్రతి గిరిజనుడికి కొండపోడు పట్టాలను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిరంతర ప్రక్రియగా అందిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో 54 వేల వరకూ పట్టాలు ఇచ్చారు. వారందరికీ వైఎస్సార్ రైతుభరోసా పథకంలో పెట్టుబడి సాయం అందిస్తున్నారు. అంతేకాదు ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామ సచివాలయాలన్నింటిలో ఉద్యోగాలన్నీ గిరిజన అభ్యర్థులకే ఇవ్వడం జగన్మోహన్రెడ్డి అందించిన గొప్ప వరం. 50 సంవత్సరాల వయసు నిండిన ప్రతి గిరిజనుడికీ సామాజిక పింఛను ఇస్తున్నారు. మౌలిక వసతులన్నీ మెరుగు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) కింద నియోజకవర్గంలో 26 తారు రోడ్డులు బాగు చేశాం. రూ.38.39 లక్షల వ్యయంతో 63.40 కిలోమీటర్ల పొడవున నిర్మాణం పూర్తి అయ్యింది. సీసీడీపీ పథకం కింద సీసీ రోడ్లు ఎనిమిది మంజూరు చేశాం. రూ.75 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే మూడు రోడ్ల నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. వరద నివారణకు గోడల నిర్మాణ పనులు చేపట్టాం. ఎన్ఆర్ఈజీఎస్ కింద కోటి రూపాయల అంచనాతో ఈ పనులు మంజూరు చేశాం. ప్రస్తుతం అవన్నీ ప్రగతి దశలో ఉన్నాయి. తోటపల్లికి పూర్వవైభవం పాలకొండ నియోజకవర్గానికే కాదు ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కీలకమైన తోటపల్లి ప్రాజెక్టుకు జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న చర్యలతో పూర్వ వైభవం వచ్చింది. పాలవలస రాజశేఖరం, పాలవలస విక్రాంత్‌లతో కలిసి నేను చేసిన విజ్ఞాపన మేరకు ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రాజెక్టు పనులకు రూ.193 కోట్లను మంజూరు చేశారు. మరమ్మతులు, పిల్ల కాలువల పనులకు వీటిని వినియోగిస్తున్నారు. లైనింగ్ పనులకు రూ.23 కోట్ల మేర బిల్లులు చెల్లించారు. మన బడి నాడు–నేడుతో మారిన తీరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మన బడి నాడు–నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. ఇప్పటికే మొదటి దశ విజయవంతంగా పూర్తి అయ్యింది. రెండో దశలో 60 పాఠశాలలు, 15 అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులు, ప్రాథమిక సౌకర్యాలు కల్పించడానికి రూ.19.57 కోట్లు మంజూరయ్యాయి. వాటిలో 14 భవనాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మిగతావి ప్రారంభ దశలో ఉన్నాయి. -
నువ్వు నా చెల్లివంటి దానివి...
శ్రీకాకుళం, పాలకొండ రూరల్: ‘అమ్మా రాజేశ్వరి.. నువ్వు నా చెల్లివంటి దానివి... నాటువైద్యం మంచిదికాదు... నన్ను నమ్ము... నీ ఆరోగ్యం మా బాధ్యత’ అని సీతంపేట ఐటీడీఏ పీవో ఎం సాయికాంత్‌వర్మ గిరిజన బాలింత సవర రాజేశ్వరిని బతిమలాడారు. ఆది వారం రాజేశ్వరి వైద్యానికి నిరాకరించటం, ఆమెను ఒప్పించేందుకు ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, ఆర్డీవో, ఇతర అధికారులు శతవిధాలా ప్రయత్నించిన విషయం విదితమే. ఈ క్రమంలో విషయాన్ని పర్యవేక్షిస్తున్న పీవో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో విశాఖ నుంచి పాలకొండ ఏరియా ఆస్పతికి చేరుకుని తనవంతు ప్రయత్నం చేశారు. దాదాపు గంట పాటు బాలింతను ఒప్పించే ప్రయత్నం చేశారు. ఎంతసేపటికి ఆమె ససేమిరా అనటంతో తానే స్వయంగా మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పటంతో ఎట్టకేలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాత్రి 12 గంటల సమయంలో పీవో తన సొంత వాహనంలో రాగోలు జెమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగలిగారు. సోమవారం అక్కడి వైద్యులు రాజేశ్వరికి అవసరమైన వైద్య పరీక్షలు చేశారు. ఒక యూనిట్ రక్తాన్ని అందించారు. అదేవిధంగా వైద్య ఖర్చులకు కొంత ఆర్థిక సాయం అందించారు. ప్రస్తుతం రాజేశ్వరి ఆరోగ్యం నిలకడగా ఉందని జెమ్స్ వైద్యులు స్పష్టం చేశారు. పీవో వెంట ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌వో ఈఎన్‌వీ నరేష్ రాత్రంతా ఉన్నారు. ఏదేమైనా బాలింత ఆరోగ్యం పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు తీసుకున్న శ్రద్ధ ప్రశంసలు అందుకుంటున్నాయి. గిరిజన బాలింతను ఒప్పించిన ఎమ్మెల్యేకు అభినందన సీతంపేట: అవగాహన లేమి, మూఢవిశ్వాసాలతో వైద్యానికి నిరాకరించిన సీదిగూడకు చెందిన గిరిజన బాలింత రాజేశ్వరిని ఒప్పించిన పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతిని ఐటీడీఏ పీవో సాయికాంత్ వర్మ అభినందించారు. సోమవారం సాయంత్రం ఐటీడీఏలో పుష్పగుచ్ఛం అందజేసి దుశ్శాలువాతో సన్మానించారు. అధికార యంత్రాంగం వేడుకున్నా ఇంటికి వెళ్లిపోతానని మొండిపట్టు పట్టి వైద్యానికి నిరాకరించిన ఆమెను ఓ దారికి తెచ్చి వైద్యం చేయించారని పీవో ఆనందం వ్యక్తం చేశారు. రెండు రోజులుగా ఆమెను ఒప్పించలేకపోయామని, చివరకు ఎమ్మెల్యే నచ్చచెప్పడంతో అంగీకరించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో ఆనందరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛంతో అభినందిస్తున్న పీవో సాయికాంత్ వర్మ -
నా తల్లివి కదూ వైద్యం చేయించుకో..
శ్రీకాకుళం, పాలకొండ రూరల్: అవగాహన లేమి, మూఢ విశ్వాసాలతో వైద్యం చేయించుకునేందుకు నిరాకరిస్తున్న గిరిజన యువతిని ఒప్పించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అష్టకష్టాలు పడింది. చివరకు ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి సైతం బతిమాలాల్సి వచ్చింది. ఆమె బుజ్జగించి, ధైర్యం చెప్పడంతో ఎట్టకేలకు ఆ బాలింత అయిష్టంగానే అంగీకరించింది. దీంతో వైద్యులు ఆక్సిజన్ పెట్టి సెలైన్ ఎక్కిస్తున్నారు. వివరాలు.. సీతంపేట మండలం కుశిమి పంచాయతీ సీదిమానుగూడకు చెందిన సవర రాజే శ్వరి విశాఖ కేజీహెచ్‌లో జనవరి 27న పండంటి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే అక్కడ తనకు సక్రమంగా వైద్య సేవలు అందడం లేదని అక్కడి వైద్యులకు చెప్పా పెట్టకుండా బిడ్డను తీసుకుని భర్త దుర్గారావుతో కలసి స్వగ్రామం వచ్చేసింది. గత రెండు రోజుల నుంచి రక్తహీనతతో రాజేశ్వరి శరీరం పొంగిపోయి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడంతో స్థానిక ఆశా కార్యకర్తల ద్వారా ఈ విషయాన్ని కుశిమి పీహెచ్సీ వైద్యులు తెలుసుకున్నారు. తక్షణమే స్పందించిన వీరు బాలింతను శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి వైద్యానికి సహకరించకపోవటంతోపాటు తనకు చిన్నప్పటి నుంచి నాటు వైద్యం తప్ప ఇంగ్లీషు మందులు పడవని, వాటిని వాడనని, తనను తక్షణమే ఇంటికి పంపించేయాలని వాదులాటకు దిగింది. ఆమెకు తోడు రాజేశ్వరి సోదరుడు, వదిన కూడా వంత పాడటంతో భర్త చేసేదిలేక మిన్నకుండిపోయాడు. రాజేశ్వరి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే, ఆర్డీవో, ఇతర అధికారులు వైద్యాధికారి రాజ్‌గోపాల్ అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వైద్యులు ఈ సమాచారాన్ని ఐటీడీఏ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న ఐటీడీఏ పీఓ సాయికాంత్ వర్మ స్పందించి అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో పాలకొండ ఆర్డీవో టీ.వీఎస్జీ.కుమార్, ఎస్సై ఆర్.జనార్దనరావు, కమిషనర్ లిల్లీ పుష్పనాథం, ఆర్ఐ రమేష్‌బాబు, వీఆర్వోలు బంకి రాజా, బలివాడ సాయి తదితరులు ఆస్పత్రికి చేరుకొని గిరిజన కుటుంబీకులను ఒప్పించే యత్నం చేశారు. అన్నివిధాలా చెప్పి ఆర్ధికంగా, అధికారికంగా సహకరిస్తామన్నారు. అయినా వారు తమను ఇంటికి పంపేయాలని, పసరు వైద్యం చేయించకుంటామని తేల్చిచెప్పటంతో శతవిధాల ఓప్పించే యత్నం చేశారు. ఈ కాలంలో కూడా నాటు, పసరు వైద్యంపై ఇంత నమ్మకమేమిటని, వైద్యులకు సహకరించాలని నచ్చచెప్పినా ఫలితం లేకపోయింది. ఎమ్మెల్యే రాకతో.. విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి రాత్రి 8 గంటల సమయంలో ఆస్పత్రికి చేరుకొని రాజేశ్వరిని, ఆమె కుటుంబ సభ్యులను వైద్యం చేయించుకోవాలని బతిమలాడారు. తన బిడ్డ వంటి దానివని, తన మాట విని మందులు వేసుకోవాలని నచ్చజెప్పారు.ఒకానొక దశలో ఆ మందులు తానుకూడా వేసుకుంటానని చెప్పటంతో రాజేశ్వరి మాట విని కొంత మేర వైద్యానికి సహకరించడంతో తక్షణమే వైద్యులు ఆక్సిజన్ అందించి సెలైన్ పెట్టారు. ఓ గిరిజన బాలింత ఆరోగ్యం కాపాడేందుకు అధికారులు స్పందించిన తీరును అంతా ప్రశంసించారు. ఎమ్మెల్యే రాత్రి 9 గంటల వరకు ఉండి బాలింత వైద్యానికి సహకరించాక అక్కడి నుంచి నిష్క్రమించారు. -
తిత్లీ తుఫాన్‌తో నష్టపోయాం
సీతంపేట: తిత్లీ తుఫాన్ ప్రభావంతో బాగా నష్టపోయామని పలువురు గిరిజనులు పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సీతంపేట మండలంలోని వజ్జాయిగూడ, పాతవజ్జాయిగూడ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. పూరిళ్లు, రేకిళ్లు ఎగిరిపోయాయని, జీడి,మామిడి, అరటి తదితర పంటలకు నష్టం వాటిల్లిందని, రహదారి లేక అనేక అవస్థలు పడుతున్నామని గిరిజనులు వాపోయారు. గిరిజనోత్పత్తులను మార్కెట్‌కు తీసుకువెళ్లాలన్నా ఇబ్బందులు తప్పడం లేదని, కొద్దిరోజుల కిందట ప్రిన్సిపల్ సెక్రటరీ తమ గ్రామాన్ని సందర్శించి రహదారి నిర్మిస్తామని చెప్పినా ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తిత్లీ తుఫాన్ కారణంగా నష్టపోయిన గిరిజన రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్వే గడువును పెంచాలన్నారు. బాధితులందరికీ న్యాయం చేయాలని కోరారు. అనంతరం పాతలోవగూడ గ్రామాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎస్.లక్ష్మి, మండల వైఎస్సార్సీపీ మహిళా కన్వీనర్ ఆరిక కళావతి, పీసా చట్టం ఉపాధ్యక్షుడు నిమ్మక సోమయ్య, పార్టీ నేతలు గణేష్, చంద్రశేఖర్, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
అవ్వకు ఎంత కష్టం!
శ్రీకాకుళం: ఈ చిత్రంలో కనిపిస్తున్న అవ్వ పేరు సవర బూదమ్మ. ఈమె వయస్సు 75 సంవత్సరాలు. ఈమెకు నా అంటూ ఎవరూ లేరు. భర్త ఎప్పుడో మృతి చెందాడు. సంతానం లేదు. దీంతో ఒంటిరిగా ఈ వయస్సులో అష్టకష్టాలు పడుతూ జీవనాన్ని నెట్టుకొస్తుంది. ఈమెకు నిబంధనల మేరకు పీటీజీ కావడంతో అంత్యోదయ కార్డు ఉండాల్సి ఉంది. కానీ అందరిలాంటి రేషన్‌కార్డు ఉండడంతో నెలకు కేవలం ఐదు కిలోల బియ్యం మాత్రమే ప్రభుత్వం సరఫరా చేస్తుంది. దీంతో నెలంతా సాగలేక అష్టకష్టాలు పడుతూ ఇబ్బందుల పాలవుతుంది. తాను నివసిస్తున్న ఓ రేకుల షెడ్డుకు మరమ్మతులై వర్షానికి కారుతుండడంతో ఇలా సిమెంటు రాసేందుకు ఇంటి పైకప్పు మీదకు ఎక్కి తన పని తాను చేసుకుంటూ శుక్రవారం సాక్షి కెమెరాకు చిక్కింది. దీన్ని గుర్తించిన ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అవ్వకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. –సీతంపేట -
మహిళలను గౌరవించలేరా..?
వీరఘట్టం: మరుగుదొడ్లు లేక ఆడవారు బయటకు వెళ్తుంటే, ఆ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టి మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా అంటూ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి అధికారులపై మండిపడ్డారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల్లో వీరఘట్టం మండలం ఎంతో వెనకబడి ఉందని, అధికారులు చిత్తశుద్ధితో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే రెల్లివీధి, సెగిడివీధి, కొండవీధి, గొల్లవీధి, బీసీ కాలనీల్లో చాలా గృహాలకు మరుగుదొడ్లు లేవని, మరుగుదొడ్లు నిర్మిద్దామన్నా స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్న వారికి సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలని ఎంపీడీఓ అరుణను ఆదేశించారు. రెల్లివీధి, కొండవీధి, సెగిడివీధి మహిళలు ముఖ్యంగా మరుగు సమస్యతో ఇబ్బందులు పడుతున్న విషయం పలుమార్లు తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో మండల ఇంజినీరింగ్ అధికారి ఎస్.శంకరరావు, ఏపీఓ సత్యంనాయుడు తదితరులు ఉన్నారు. -
ఎమ్మెల్యేలను లాక్కోవడమే మీ పనా..?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాలకొండ ఎమ్మెల్యే కళావతి సీతంపేట: ఎమ్మెల్యేలను లాక్కోవడానికే ప్రభుత్వం సమయమంతా ఖర్చు చేస్తోందని, ప్రజా సమస్యలు గాలికి వదిలేస్తోందని పాలకొండ ఎమ్మెల్యే కళావతి ఘాటుగా విమర్శించారు. ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కరువు మండలాలను ప్రకటించి నెలలు గడుస్తున్నా ఎలాంటి పరిహారం అందలేదని తెలి పారు. కనీసం ఎన్టీఆర్ జలసిరిలో తీస్తామన్న బోర్లు కూడా తీయలేదని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్లో అక్రమాలు జరిగాయని ఆరుగురు ఏజెన్సీ ఎమ్మెల్యేలం ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఐటీడీఏ టీఎస్పీ పరిధిలో వెలు గు, యూత్‌ట్రైనింగ్ కేంద్రాలకు కంప్యూటర్లు, వివిధ రకాల మెటీరియల్ కొనుగోలులో లక్షలాది రూపాయల అ వినీతి జరిగినా దర్యాప్తు చేయకపోవ డం అన్యాయమన్నారు. ఉపకార వేతనా ల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయన్నారు. దీనిపై సీబీసీఐడీ ద ర్యాప్తు చేయాలన్నారు. ఎస్డీఎఫ్ జి ల్లాకు నిధులు రూ.50 కోట్లు కేటాయిస్తే ఇంతవరకు దాన్ని 10 నియోజకవర్గాలకు ఎలా పంపిణీ చేశారో చెప్ప డం లేదన్నారు. స్పోర్ట్స్ పాఠశాల ఎచ్చెర్లలో నిర్మిస్తామని, ఇప్పుడు లంబసిం గిలో పెడతామనడం ఎంతవరకు సమంజసమన్నారు. జన్మభూమి కమిటీల ద్వారా వృద్ధులు, వితంతువుల పింఛన్లను కూడా తీసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.