కూలిన సిగ్నల్‌ టవర్‌ | Signal tower collapsed In Palakonda | Sakshi
Sakshi News home page

కూలిన సిగ్నల్‌ టవర్‌

Published Fri, Jun 8 2018 12:07 PM | Last Updated on Fri, Jun 8 2018 12:07 PM

Signal tower collapsed In Palakonda - Sakshi

రహదారి మధ్యలో పడిపోయిన టవర్‌   

పాలకొండ శ్రీకాకుళం : స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సిగ్నల్‌ టవర్‌ కూలిపోయింది. గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో టవర్‌ పూర్తిగా విరిగి పాలకొండ-శ్రీకాకుళం రహదారిపై పడింది. 100 అడుగుల ఎత్తు ఉన్న టవర్‌తో పాటు దీనికి ఏర్పాటు చేసిన విద్యుత్‌ వైర్లుకూడా రహదారికి అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఉదయం ఈ సంఘటన జరిగితే ప్రమాదం జరిగేదని స్థానికులు వివరిస్తున్నారు. ఆర్డీవో కార్యాలయం సిబ్బంది దీనిని తొలగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement