colapsed
-
మోదీ క్షమాపణల్లోనూ అహంకారమే
ముంబై: సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్ కోటలో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడంపై మహా వికాస్ అఘాడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి కారణంగా ఈ తప్పిదం జరిగిందని, ఇది క్షమించరానిదని పేర్కొంది. ఆదివారం మహావికాస్ అఘాడీలోని ఎన్సీపీ(ఎస్పీ)చీఫ్ శరద్‌పవార్, శివసేన(యూబీటీ)చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేల సారథ్యంలో ముంబైలోని హుతాత్మ చౌక్ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు భారీ ర్యాలీ జరిగింది. ఆగస్ట్ 26న విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో క్షమాపణ చెప్పడం తెలిసిందే. దీనిపై ఠాక్రే స్పందిస్తూ..‘క్షమాపణ చెప్పడంలో ప్రధాని మోదీ అహంకారాన్ని గమనించారా? ఆయన అహంకారానికి ఇదో ఉదాహరణ. అదే సమయంలో డిప్యూటీ సీఎం ఒకరు నవ్వుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అవినీతి వల్లే విగ్రహం కూలింది. ఇది మహారాష్ట్ర ఆత్మకే అవమానం. క్షమించరాని నేరం. దేశం నుంచి బీజేపీ వెళ్లిపోవాలి’అని ఆయన డిమాండ్ చేశారు. సింధుదుర్గ్‌లో శివాజీ మహారాజ్ విగ్రహం బీజేపీ అవినీతి కారణంగానే కూలిందని, ఛత్రపతి అభిమానులకు ఇది అవమానకరం’అని శరద్ పవార్ పేర్కొన్నారు. -
‘శిరస్సు వంచి 100 సార్లు క్షమాపణ చెప్పేందుకు సిద్ధం’ : షిండే
ముంబై: మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో ఇటీవల 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం కూలడంపై ఆ రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. గురువారం మరాఠా యోధుడి పాదాలపై శిరస్సు వంచి 100 సార్లు క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.అయితే, ఈ విషయంలో రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా కొత్త విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేయొచ్చనే అంశంపై ప్రభుత్వానికి తగు సలహాలు ఇవ్వొచ్చని సూచించారు. ‘రాజకీయం చేయడానికి అనేక సమస్యలు ఉన్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ మనందరి దేవుడు. దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దు. ఆయన పాదాలకు శిరస్సు వంచి ఒక్కసారి కాదు వందసార్లు క్షమాపణలు చెబుతాను. మహాత్మున్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర వ్యవహారాల్ని చక్కబెడుతున్నాము’అని అన్నారు. ‘బుధవారం రాత్రి మేం ఐఐటీల ఇంజనీర్లు, నేవీ అధికారులతో భేటీ అయ్యాము. కొత్త విగ్రహం ఏర్పాటుపై రెండు కమిటీలను నియమించాం. ఆ స్థలంలో త్వరలో ఓ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ఏక్నాథ్ షిండే వెల్లడించారు. విగ్రహం కూలిపోవడానికి గల కారణాలను ఒక కమిటీ గుర్తించి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఛత్రపతి శివాజీ విగ్రహాలను తయారు చేసిన అనుభవం ఉన్న శిల్పులు, నిపుణులతో పాటు ఇంజనీర్లు, నేవీ అధికారులతో మరో కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. -
కుప్పకూలిన కోచింగ్ సెంటర్; ఐదుగురు మృతి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో భవనం కుప్పకూలిన మరో ఘటన విషాదాన్ని నింపింది. భజన్‌పురా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం శనివారం కూలిపోయింది. పైకప్పు కూలిన ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం. వీరిలో నలుగురు విద్యార్థులుకాగా, ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. గాయపడిన మరో 13మంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఈ భవనంలో కోచింగ్ సెంటర్ నడుస్తుండటంతో పలువురు విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్టుగా అనుమానిస్తున్నారు. మూడు అంతస్తుల భవనం రెండవ, మూడవ అంతస్తులో నిర్మాణం జరుగుతోందని, సాయంత్రం 5 గంటల సమయంలో అకస్మాత్తుగా కూలిపోయిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే రక్షణ సహాయక చర్యలను చేపట్టడానికి ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (డిఎఫ్ఎస్) బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఏడుగురిని రక్షించినట్లు డిఎఫ్ఎస్ అధికారి తెలిపారు. సుమారు 15 మంది శిధిలాలలో చిక్కుకున్నట్టుగా అనుమానిస్తున్నామన్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై వచ్చిన ట్వీట్లకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానీ, మరికొద్ది సేపట్లో సంఘటనా స్థలానికి వెళ్లబోతున్నానని ట్వీట్ చేశారు. दिल्ली के भजनपुरा इलाके में कोचिंग सेंटर की छत गिर गई है, 11 छात्रों को अस्पताल ले जाया गया है|अभी रेस्क्यू ऑपरेशन जारी है, कई के फंसे होने की आशंका है| pic.twitter.com/tXA006oLjx — Anurag Dhanda (@anuragdhanda) January 25, 2020 -
కుప్పకూలిన దిగ్గజం, 22 వేల ఉద్యోగాలు ప్రమాదంలో
బ్రిటిష్ పర్యాటక సంస్థ థామస్‌కుక్ కుప్పకూలింది. 178 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కంపెనీ దివాలా ప్రకటించడంతో వేలాదిమంది ఉద్యోగుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. చివరి నిమిషంలో జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో థామస్‌కుక్ దివాలా తీసింది. ప్రపంచవ్యాప్తంగా థామస్‌కుక్ తన విమాన సేవలను నిలిపివేసినట్టుగా బ్రిటిష్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది. థామస్కుక్కు చెందిన విమాన, హాలిడే బుకింగ్స్‌లను రద్దు చేసినట్టు ప్రకటించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 22వేల ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోయాయి. వీరిలో 9వేల మంది బ్రిటన్ వారున్నారు. అంతేకాదు వేలాదిమంది ప్రయాణీకులు ఇబ్బందుల్లో చిక్కుకుపోయారు. సంస్థ పతనం తీవ్ర విచారం కలిగించే విషయమని థామస్ కుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ ఫాంక్‌హౌజర్ ఆదివారం రాత్రి పేర్కొన్నారు. దీర్ఘకాలిక చరిత్ర ఉన్నసంస్థ దివాలా ప్రకటించడం సంస్థలకు, లక్షలాది కస్టమర్లకు, ఉద్యోగులకు చాలా బాధ కలిగిస్తుందని, ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని చెప్పారు. తప్పనిసరి లిక్విడేషన్లోకి ప్రవేశించిందంటూ కస్టమర్లు, వేలాదిమంది ఉద్యోగులకు అయన క్షమాపణలు చెప్పారు. మరోవైపు ఇది చాలా విచారకరమైన వార్త అని బ్రిటన్ రవాణా కార్యదర్శి గ్రాంట్ షాప్స్ చెప్పారు. అలాగే పర్యాటకులను, కస్టమర్లను వారివారి గమ్యస్థానాలకుచేర్చేందుకు ఉచితంగా 40కి పైగా చార్టర్ విమానాలను సీఏఏ అద్దెకు తీసుకుందని తెలిపారు. కాగా ప్రపంచంలోని ప్రసిద్ధ హాలిడే బ్రాండ్లలో ఒకటైన థామస్ కుక్‌ను 1841లో లీసెస్టర్స్ షైర్లో క్యాబినెట్-మేకర్ థామస్ కుక్ స్థాపించారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో నష్టాలు భారీగా పెరగనున్నాయని ఈ ఏడాది మేలోనే థామస్ కుక్ వెల్లడించింది. బ్రెగ్జిట్ అనిశ్చితి కారణంగా సమ్మర్ హాలిడే బుకింగ్స్ ఆలస్యం కావడంతో సంక్షోభం మరింత ముదిరింది. థామస్ కుక్ సీఈవో పీటర్ ఫాంక్‌హౌజర్ అయితే థామస్ కుక్ ఇండియా మాత్రం ఆర్థికంగా, నిర్వహరణ పరంగా చాలా పటిష్టంగా ఉంది. 2012 నుంచి స్వతంత్ర సంస్థగా కొనసాగుతున్న ఈ కంపెనీలో మేజర్ వాటా ఫెయిర్‌ఫాక్స్ గ్రూపు సొంతం. Lots of red cancelled markers for Thomas Cook flights due out from Manchester Airport today. Live on @bbc5live throughout the morning. pic.twitter.com/UuiTk9sjRU — Justin Bones (@justinbones) September 23, 2019 అయితే థామస్ కుక్ ఇండియా ఆర్థికంగా, నిర్వహరణ పరంగా చాలా పటిష్టంగా ఉంది. 2012 నుంచి స్వతంత్ర సంస్థగా కొనసాగుతున ఈ కంపెనీలో మేజర్ వాటా ఫెయిర్‌ఫాక్స్ గ్రూపు సొంతం. -
కూలిన సిగ్నల్ టవర్
పాలకొండ శ్రీకాకుళం : స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సిగ్నల్ టవర్ కూలిపోయింది. గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో టవర్ పూర్తిగా విరిగి పాలకొండ-శ్రీకాకుళం రహదారిపై పడింది. 100 అడుగుల ఎత్తు ఉన్న టవర్‌తో పాటు దీనికి ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లుకూడా రహదారికి అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఉదయం ఈ సంఘటన జరిగితే ప్రమాదం జరిగేదని స్థానికులు వివరిస్తున్నారు. ఆర్డీవో కార్యాలయం సిబ్బంది దీనిని తొలగించారు. -
అవినీతి అంతంతోనే నవ సమాజం
ఆహింసతోనే తెలంగాణ సాధించాం కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఖిలావరంగల్ : దేశంలో అవినీతి రాజ్యమేలుతోందని, దాన్ని అంతం చేసినప్పుడే విలువల తో కూడిన నవ సమాజం సాధ్యమవుతుందని కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. మహాత్మాగాంధీ ఇచ్చిన స్ఫూర్తి, ఆహింస మార్గంతోనే తెలంగా ణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. వరంగల్ స్టేషన్ రోడ్డులోని ఆనంద ఆశ్రమ చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరైన శ్రీధర్ మాట్లాడుతూ.. అహింసా మార్గంలోనే మహాత్మాగాంధీ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారని అన్నారు. అయితే ఆయన కలలు గన్నట్టుగా కాకుండా నేడు దేశం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఆవినీతి ఉన్నంత వరకు ఉగ్రవాదం బలపడుతూనే ఉంటుందని హెచ్చరించారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఆశ్రమ చైర్మ¯న్ , రిటైర్డ్ ఫ్రొఫెసర్ ఎస్. పర్మాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటి రిటైర్డ్ ఫ్రొఫెసర్ గోపాల్‌రావు, ఆకారపు హరీశ్, కరీంనగర్ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ వేదాంతం లలితాదేవి తదితరులు పాల్గొన్నారు. మా నాన్న ఇక్కడే లైబ్రేరియన్ గా పనిచేశారు హన్మకొండ చౌరస్తా :‘మా నాన్న ఎంఎస్ ఆచారి రాజరాజనరేంద్ర భాషా నిలయం లో గల గ్రంథాలయంలో లైబ్రేరియన్ గా పనిచేశార’ని మాడభూషి శ్రీధర్ ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. హన్మకొం డలోని రాజరాజనరేంద్ర భాషా నిలయం లో ఆదివారం లోక్‌సత్తా ఆధ్వర్యంలో ‘ఏకకాలంలో చట్టసభల ఎన్నికలు– సంస్కరణలు’ అంశంపై జరిగిన చర్చాగోష్టిలో ఆ యన మాట్లాడారు. సుదీర్థ కాలం తర్వా త తన తండ్రి పనిచేసిన చోటుకు రావడం ఆనందంగా ఉందన్నారు. చట్టసభలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ మంచి పరిణామమేనని, అయితే ఎన్నికల్లో డబ్బు ప్రాత నానాటికీ పెరగడం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.