
సాక్షి, హైదరాబాద్: ప్రేమించిన అమ్మాయితో విభేదాలు రావడంతో తేజావత్ రాజు అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించేవాడు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగం చెరువు తండాలో కుటుంబ సభ్యులతో కలిసి నివసించేవాడు. రాజుకు బంధువుల అమ్మాయితో గత కొద్ది రోజులుగా ప్రేమ వ్యవహారం నడిచినట్టు సమాచారం.
అయితే, వీరి మధ్య గత కొద్దిరోజులుగా విభేదాలు వచ్చినట్టు తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన రాజు నిన్న రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం రాజు తన గదిలో విగతజీవిగా పడిఉండటంతో గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజు మృత దేహన్నీ గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: పెళ్లయిన తొమ్మిది నెలలకే.. కన్నవారింట్లోనే..)
Comments
Please login to add a commentAdd a comment