ప్రేమజంటకు సహకరించాడని.. | Youngster to attack on helping to love fair | Sakshi
Sakshi News home page

ప్రేమజంటకు సహకరించాడని..

Published Sat, Aug 15 2015 4:54 PM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM

ప్రేమజంటకు సహకరించాడని..

ప్రేమజంటకు సహకరించాడని..

కొత్తకోట(మహబూబ్‌నగర్): ఓ బాలిక ప్రేమ వ్యవహారంలో ప్రత్యక్ష ప్రమేయం ఉందంటూ ఆమె బంధువులు శనివారం ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం నర్సింగాపురం గ్రామానికి చెందిన గుజ్జుల ఊహ (17)అదే గ్రామానికి చెందిన దళిత యువకుడు ఆనంద్ (22)ప్రేమించుకున్నారు. రెండు నెలల క్రితం ఇద్దరూ కలిసి ఎటో వెళ్లిపోయారు. దీంతో మైనర్ కూతురిని కిడ్నాప్ చేశారంటూ ఆమె తండ్రి ఆంజనేయులు కొత్తకోట పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే, పోలీసులు మాత్రం బాలిక తప్పిపోయినట్లు కేసు నమోదు చేసుకున్నారు.

గత నెల 25వ తేదీన ఆనంద్, ఊహ కొత్తకోట పోలీసులను ఆశ్రయించారు. వైద్యులు బాలిక వయస్సు 17 ఏళ్లుగా నిర్ధారించగా పోలీసులు ఆమెను వనపర్తిలోని స్టేట్ హోంకు తరలించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న బాలకృష్ణ (30) శనివారం గ్రామానికి రావటంతో అతన్ని బాలిక కుటుంబ సభ్యులు కట్టేసి కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని విడిపించారు. దాడికి పాల్పడ్డ 8 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. గాయపడ్డ బాలకృష్ణను వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై కృష్ణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement