Youngster attack
-
బెజవాడ పాతబస్తీలో దారుణ ఘటన! క్యాటరింగ్ బాయ్..
విజయవాడ: పాతబస్తీలో గురువారం సాయంత్రం దారుణహత్య చోటు చేసుకుంది. రద్దీగా ఉండే ప్రాంతంలో అనూహ్యంగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. గుగ్గిలం ఏసుబాబు (వాసు) (45) క్యాటరింగ్ పనులు చేస్తూ జీవిస్తుంటాడు. ఈయన పలువురికి జీవనోపాధి కూడా కల్పిస్తున్నాడు. అతని వద్ద నాగార్జున అలియాస్ గణేష్ అనే యువకుడు క్యాటరింగ్ పనులు చేస్తూ ఉంటాడు. వీరిద్దరి మధ్య కొద్ది రోజులుగా రూ.5 వేల నగదుకు సంబంధించి గొడవ జరుగుతోంది. క్యాటరింగ్ పనులు చేసేవారంతా రమణయ్య కూల్‌డ్రింక్ షాప్ సెంటర్ కేరాఫ్ అడ్రస్‌గా తిరుగుతూ ఉంటారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం 5.30 గంటల సమయంలో నాగార్జున ఏసుబాబుతో గొడవకు దిగినట్లు తెలిసింది. ఆ క్రమంలో ఏసుబాబు నాగార్జునను గట్టిగా అరవటంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ క్రమంలో క్యాటరింగ్ సామగ్రిలోని మటన్ కొట్టే కత్తితో నాగార్జున ఏసుబాబుపై దాడి చేయటంతో అక్కడికక్కడే అతను మృతి చెందాడు. స్థానికులిచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న వన్‌టౌన్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సురేష్‌బాబు తెలిపారు. -
ఇన్‌స్టాలో పరిచయం.. హైదరాబాద్ పిలిపించి యువకుడిపై యువతి దాడి
సాక్షి, హైదరాబాద్: ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైన యువకుడిని హైదరాబాద్ పిలిపించి ఓ యువతి దాడి చేసింది. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బెంగళూరుకు చెందిన బడిగ జీవన్(24)కు బోడుప్పల్ కు చెందిన రజిత అనే యువతి ఇన్‌స్టా ద్వారా పరిచయమైంది. అతన్ని హైదరాబాదుకు రావాలని యువతి కోరింది. ఈ నేపథ్యంలో ఈ నెల 12న జీవన్ కాచిగూడకు వచ్చి రైల్వేస్టేషన్లో వేచి ఉన్నాడు. రజితతోపాటు చింటు అనే యువకుడు వచ్చి జీవన్‌ను బోడుప్పల్‌లోని ఇంటికి తీసుకెళ్లారు. ఇంట్లో ఇద్దరూ కలిసి రూ. 2 లక్షలు డిమాండ్ చేసి ఇష్టానుసారంగా దాడికి పాల్పడ్డారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. చదవండి: దారుణం: పెళ్లి చేయలేదని తండ్రి గొంతు కోసిన కొడుకు -
మాస్క్ పెట్టుకోమన్నందుకు కార్పొరేటర్‌పై దాడి
పట్నంబజారు(గుంటూరు): మంచి చెబితే చెడు ఎదురైందన్న చందంగా జరిగింది నగరంలో ఓ కార్పొరేటర్‌కు...మాస్క్ లేకుండా తిరుగుతున్న కుర్రాడిని మాస్క్ పెట్టుకోమన్నందుకు కార్పొరేటర్‌పై దాడి చేయటం బుధవారం నగరంలో సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే... గుంటూరు నగరంలోని 32వ డివిజన్ కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి) బుధవారం ఉదయం బ్రాడీపేట ప్రాంతంలో రోజూ మాదిరిగానే పర్యటిస్తూ శానిటేషన్ పనులు చేయిçస్తున్నారు. ఈ క్రమంలో 4/17లో సాయిచరణ్ బాయ్స్ హాస్టల్ వద్ద భారీ సంఖ్యలో యువకులు ఎటువంటి మాస్క్‌లు లేకుండా కూర్చుని ఉన్నారు. ఇది గమనించిన ఆచారి ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్‌లు లేకుండా గుంపులుగా కూర్చోవటం సరికాదని చెప్పారు. దీంతో రెచ్చిపోయిన యువకులు నువ్వు మాకు చెప్పేది ఏంటంటూ ఆచారిపై దాడికి తెగబడ్డారు. వసతిగృహం పక్కన ఉన్న రాళ్లతో ఆయనపై దాడి చేయటంతో గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఆచారి పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్లో ఉండే ఎస్.శివశంకర్, ఎస్.వెంకటేశ్వర్లు, వి.హేమంత్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మరికొంత మంది ఉన్నట్లు గుర్తించామని వారిని అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. ఘటన గురించి తెలుసుకున్న మేయర్ కావటి మనోహర్‌నాయుడు పట్టాభిపురం స్టేషన్‌కు వచ్చారు. ఘటనకు కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : ఆచారి మాస్క్ పెట్టుకోమన్నందుకు తనపై దాడి చేసిన యువకులతో పాటు వారిని కాపాడేందుకు ప్రయత్నించిన హాస్టల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆచారి డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని హాస్టళ్ల వద్ద నిత్యం ఇదే తంతు నడుస్తోందని, యువకులు మాస్క్‌లు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పలు హాస్టళ్ల వద్ద గంజాయి సేవిస్తున్న పరిస్థితులను కూడా తాను గుర్తించినట్లు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. చదవండి: ‘యానాం’ రైతులకూ ‘వైఎస్సార్ రైతు భరోసా’ -
ప్రేమజంటకు సహకరించాడని..
కొత్తకోట(మహబూబ్‌నగర్): ఓ బాలిక ప్రేమ వ్యవహారంలో ప్రత్యక్ష ప్రమేయం ఉందంటూ ఆమె బంధువులు శనివారం ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం నర్సింగాపురం గ్రామానికి చెందిన గుజ్జుల ఊహ (17)అదే గ్రామానికి చెందిన దళిత యువకుడు ఆనంద్ (22)ప్రేమించుకున్నారు. రెండు నెలల క్రితం ఇద్దరూ కలిసి ఎటో వెళ్లిపోయారు. దీంతో మైనర్ కూతురిని కిడ్నాప్ చేశారంటూ ఆమె తండ్రి ఆంజనేయులు కొత్తకోట పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే, పోలీసులు మాత్రం బాలిక తప్పిపోయినట్లు కేసు నమోదు చేసుకున్నారు. గత నెల 25వ తేదీన ఆనంద్, ఊహ కొత్తకోట పోలీసులను ఆశ్రయించారు. వైద్యులు బాలిక వయస్సు 17 ఏళ్లుగా నిర్ధారించగా పోలీసులు ఆమెను వనపర్తిలోని స్టేట్ హోంకు తరలించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న బాలకృష్ణ (30) శనివారం గ్రామానికి రావటంతో అతన్ని బాలిక కుటుంబ సభ్యులు కట్టేసి కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని విడిపించారు. దాడికి పాల్పడ్డ 8 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. గాయపడ్డ బాలకృష్ణను వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై కృష్ణ తెలిపారు. -
ఇంటిపై దాడి.. ఆపై యువతిపై అత్యాచారయత్నం
తిరుపతి: ఓ ఇంటిపై దాడి చేసిన యువకులు.. ఆ ఇంట్లో ఉన్న ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన తిరుపతిలోని సత్యనారాయణపురంలో శుక్రవారం వెలుగుచూసింది. దాంతో బాధితురాలు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.