Hyderabad: Woman Attack On Man Who Known Friend In Instagram - Sakshi
Sakshi News home page

ఇన్‌స్టాలో పరిచయం.. హైదరాబాద్‌ పిలిపించి యువకుడిపై యువతి దాడి

Published Tue, Jun 14 2022 12:02 PM | Last Updated on Tue, Jun 14 2022 2:48 PM

Hyderabad: Woman Attack On Man Who Known Friend In Instagram - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైన యువకుడిని హైదరాబాద్‌ పిలిపించి ఓ యువతి దాడి చేసింది. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. బెంగళూరుకు చెందిన బడిగ జీవన్‌(24)కు  బోడుప్పల్‌ కు చెందిన రజిత అనే యువతి ఇన్‌స్టా ద్వారా పరిచయమైంది. అతన్ని హైదరాబాదుకు రావాలని యువతి కోరింది.

ఈ నేపథ్యంలో ఈ నెల 12న  జీవన్‌ కాచిగూడకు వచ్చి రైల్వేస్టేషన్‌లో వేచి ఉన్నాడు. రజితతోపాటు చింటు అనే యువకుడు  వచ్చి జీవన్‌ను బోడుప్పల్‌లోని ఇంటికి తీసుకెళ్లారు. ఇంట్లో ఇద్దరూ కలిసి రూ. 2 లక్షలు డిమాండ్‌ చేసి ఇష్టానుసారంగా దాడికి పాల్పడ్డారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.   
చదవండి: దారుణం: పెళ్లి చేయలేదని తండ్రి గొంతు కోసిన కొడుకు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement