ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా ఓ మహిళను వేధింపులకు గురి చేసిన ఐటీ ఉద్యోగిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ఎం శంకర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. పాల్వంచ శాస్త్రి రోడ్‌కు చెందిన తాళ్లూరి సాయికృష్ణ హైదరాబాద్‌లోని టీసీఎస్ కంపెనీలో అసిస్టెంట్ సిస్టమ్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల అతను తన ఇన్‌స్టాగ్రామ్‌కు రిక్వెస్ట్ పంపించిన గుర్తు తెలియని మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడాడు. ( చదవండి: బీచ్‌లో దారుణం: ప్రియుడిని తాళ్లతో కట్టేసి.. యువతిని తోటలోకి లాక్కెళ్లి.. )
అప్పటినుంచి న్యూడ్ కాల్స్‌కు బానిసైన సాయికృష్ణ నకిలీ ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలను తెరిచాడు. మహిళల పేరుతో ఉన్న ఇన్‌స్టా ఐడీలను వెతికి, వారికి అసభ్యకరమైన సందేశాలు, ఫొటోలు, వీడియోలు పంపేవాడు. ఇదే తరహాలో ఓ మహిళను ఇబ్బందులకు గురి చేయటంతో బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు సాయికృష్ణను అరెస్ట్ చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment