
లక్నో: కరోనా ఉధృతి కారణంగా అనేక రాష్ట్రాలలో లాక్డౌన్ విధించి, కఠిన నిబంధలను అమలు పరుస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రభావం వివాహలపై కూడా పడింది. అయితే, ఈ కరోనా కాలంలో జరిగిన అనేక పెళ్లిళ్లు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. తాజాగా, మరో వివాహం ఇలాగే వార్తల్లో నిలిచింది.
వివరాలు.. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. ఎటా జిల్లాలోని సిటాన్ గ్రామానికి చెందిన మోహనీకి, ఫులాన్పూర్ గ్రామానికి చెందిన బబ్లూతో వివాహం నిశ్చయమైంది. వీరిద్దరి పెళ్లి వేడుకను బంధువుల మధ్య సిటాన్ గ్రామంలో ఎంతో వేడుకగా జరుపుతున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఇదివరకే ఆ యువతి, హయత్ నగర్ ప్రాంతానికి చెందిన అజిత్ అనే మరో యువకుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు.
అయితే, వీరి ప్రేమకు యువతి పెద్దలు మాత్రం అంగీకారం తెలపలేదు. ఈ క్రమంలో బబ్లూతో వివాహం జరిపించడానికి సిద్ధపడ్డారు. ఈ విషయం తెలియగానే అజిత్ తన బంధువులు, బ్యాండ్, బరాత్‌తో కలిసి వివాహం జరుగుతున్న చోటుకు చేరుకున్నారు. కానీ అప్పటికే మోహనీకి బబ్లూతో వివాహం జరిగిపోయింది. అజిత్ కుటుంబ సభ్యులు కాసేపు అక్కడ గందరగోళం సృష్టించారు.
ఈ ప్రేమ వ్యవహరం తెలిసిన బబ్లూ తరపు వారు, వధువు కుటుంబ సభ్యులతో వాదనకుదిగారు. దీంతో, అక్కడ ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఇరువురి బంధువులు తీవ్రంగా వాదించుకున్నారు. అయితే, కాసేపటికి రంగంలోకి దిగిన పోలీసులు, వధువు తండ్రి, మేనమామలను, అజిత్ కుటుంబ సభ్యులను అదుపులోనికి తీసుకున్నారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని తెలిపారు.
చదవండి: పెళ్లిలో వధువు చేసిన పనికి వరుడు షాక్.. వైరల్ వీడియో
Comments
Please login to add a commentAdd a comment