నారాయణఖేడ్: మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఆత్మహత్యాయత్నం ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది. నారాయణఖేడ్ మండలం చిన్ననర్సాపూర్ తండాకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులకు పురుగుల మందు తాగించి, తాను కూడా తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన కొందరు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే ఇద్దరు చిన్నారులు మృతిచెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించారు. చికిత్స నిమిత్తం ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.