ఒకరిని కాపాడబోతే.. 6గురు చిన్నారుల మృతి | Car Accidentally Falls Into Pond Six Children Died In Bihar | Sakshi
Sakshi News home page

కారు చెరువులో పడి 6గురు చిన్నారుల మృతి

Published Tue, Jun 19 2018 1:10 PM | Last Updated on Wed, Apr 3 2019 8:03 PM

Car Accidentally Falls Into Pond Six Children Died In Bihar - Sakshi

ప్రమాద స్థలంలోని దృశ్యాలు

పట్నా : బిహార్‌లోని అరారియా జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. రోడ్డు దాటుతున్న ఓ చిన్నారిని కాపాడే ప్రయత్నం చేసిన కారు డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నారిని రక్షించే క్రమంలో అదుపు తప్పిన కారు దగ్గర్లోని చెట్టును బలంగా ఢీకొట్టి పక్కనే ఉన్న చెరువులో పడిపోయింది. బాధితులు ఓ పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో 6గురు చిన్నారులతో పాటు మరో నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది. చిన్నారులు అక్కడిక్కడే మృతి చెందగా, ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మృతులు చిన్నపిల్లలు కావడంతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement