నల్గొండ(మిర్యాలగూడ): వైద్యం వికటించి బాలుడు మృతిచెందిన సంఘటన మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వివరాలు..త్రిపురారం మండలం అంజనపల్లి గ్రామానికి చెందిన గండికోట భానుప్రకాశ్(14) అనే బాలుడు జ్వరంతో బాధపడుతూ ఈ నెల 8న శ్రీ వెంకటకృష్ణ నర్సింగ్ హోమ్‌లో చేరాడు. బాలుడు చేరినపుడు ఆరోగ్యపరిస్థితి సరిగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. చికిత్సపొందుతూ సోమవారం ఉదయం అకస్మాత్తుగా మరణించాడు. దీంతో కుటుంబసభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతిచెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు.