చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి | Three child dies went swimming in pond | Sakshi
Sakshi News home page

చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి

Published Tue, Nov 4 2014 4:52 PM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

Three child dies went swimming in pond

జిల్లాలోని మెరకముడిదాం మండలంలో మంగళవారం ఓ విషాదం చోటుచేసుకుంది. గోపన్న వలసలో చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సెలవుదినం కావడంతో వారందరూ చెరువులో ఈతకు వెళ్లినట్టు స్థానికులు తెలిపారు.

ఈతకు వెళ్లిన చిన్నారులు ఇంటికి తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు ఆవేధన వ్యక్తం చేశారు. అయితే చెరువులో పడి మృతిచెందరాని వార్త వినగానే తల్లిదండ్రులు నివ్వేరపోయారు. మృతిచెందిన చిన్నారులు 10 ఏళ్ల లోపు వారే. కాగా, తమ చిన్నారులు తిరిగారాని లోకాలకు వెళ్లిపోయారంటూ తల్లిదండ్రులు కన్నీటపర్యంతమైయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement