swimming in Pond
-
భయానక దృశ్యం.. చావు అంచుల దాకా వెళ్లొచ్చాడు!
నీటిలో దిగినప్పుడు చిన్న పురుగు కనిపించినా భయంతో ఒడ్డుకు చేరతాం. అలాంటిది భారీ ఆకారంతో మొసలి దాడి చేస్తే.. ఒక్క క్షణం గుండె ఆగినంత పనవుతుంది. అలాంటి అనుభవమే ఓ వ్యక్తికి ఎదురైంది. చెరువులో ఈత కొడుతుండగా ఒక్కసారిగా ఓ భారీ మొసలి(ఎలిగేటర్) అతడిపై దాడి చేసింది. చేతిని పట్టి లాగింది. అయితే, దాని నుంచి తప్పించుకుని ఒడ్డుకు చేరాడు ఆ వ్యక్తి. స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను ‘ద సన్’ అనే యూట్యూబ్ ఛానల్లో 2021లో పోస్ట్ చేయగా.. 52 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఈ సంఘటన బ్రెజిల్లో జరిగింది. చెరువులో ఈత కొడుతున్న వ్యక్తి వైపు వేగంగా దూసుకొచ్చిన మొసలి అతని చేతిని పట్టి లాగేందుకు యత్నించింది. ఒడ్డుకు వేగంగా ఈదేందుకు బాధితుడు ప్రయత్నించగా చేతిని కరిచింది. దాని నుంచి తప్పించుకుని ఒడ్డుకు చేరుకుని ఊపిరి పీల్చుకున్నాడు. ఒడ్డుకు చేరుకున్నాక తన చేతిని పరిశీలించి చూడగా.. రక్తం కారుతూ కనిపించింది. ఇదీ చదవండి: మెట్లపై నుంచి పడిపోయిన రష్యా అధ్యక్షుడు పుతిన్ -
మృత్యువులోనూ వీడని పేగుబంధం
బాలుడి ఈత సరదా ఇద్దరి ప్రాణాలు తీసింది. ఈత కోసం చెరువులోకి దిగిన కొడుకు తన కళ్లెదుటే నీటమునుగుతుంటే కన్నతల్లి తల్లడిల్లింది. కొడుకును కాపాడేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తల్లీకొడుకులను చెరువు మింగేసింది. తాను చూస్తుండగానే భార్య, కొడుకు నీట మునిగిపోతుంటే వికలాంగుడైన భర్త నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. తల్లి, తమ్ము డిని కాపాడేందుకు మరో బాలుడు సాహసం చేసినా ప్రమాదాన్ని పసిగట్టిన తండ్రి వారించాడు. దీంతో ఆ బాలుడి నిండు ప్రాణాలు దక్కాయి. సాక్షి, ఆత్మకూరు(పరకాల): పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... వరంగల్ నగరంలోని సుందరయ్య కాలనీకి చెందిన బుధవారపు రామకృష్ణ తన భార్య భాగ్యలక్ష్మి(40), కుమారులు సంతోష్, రాహుల్(11)తో కలిసి గురువారం తన తోడల్లుడు రాజు దశదినకర్మకు ములుగు జిల్లా పస్రా వెళ్లారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత బైక్పై తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో మండలంలోని కటాక్షపూర్ సమీపంలో హైవేను ఆనుకుని ఉన్న చెరువు వద్దకు కాసేపు సేదతీరుదామని ఆగారు. అందరూ కలిసి కూల్డ్రింక్ తాగారు. చెరువులో కాళ్లు చేతులు కడుక్కున్నారు. ఇంతలో రాహుల్ ఈత కొడతానని బట్టలు విప్పి చెరువులోకి దిగాడు. కొద్ది దూరంలోనే మునుగుతుండగా గమనించిన తల్లి భాగ్యలక్ష్మి కొడుకును కాపాడేందుకు నీటిలోకి దిగింది. అప్పటికే రాహుల్ చెరువులో మునిగిపోగా, భాగ్యలక్ష్మి కూడా నీటముగినింది. ఇది గమనించిన పెద్దకుమారుడు సంతోష్ నీటిలో దిగేందుకు ప్రయత్నించగా ప్రమాదాన్ని పసిగట్టిన తండ్రి అతడిని వారించాడు. రామకృష్ణ వికలాంగుడు కావడంతో ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. కొద్దిసేపటల్లోనే తల్లీకొడుకులు మృత్యువాతపడ్డారు. రాహుల్ ఆరో తరగతి, సంతోష్ ఏడో తరగతి చదువుతున్నారు. సీఐ మహేందర్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్థానికుల సాయంతో తీయించి మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువులో మునిగి చిన్నారుల మృతి
అరకులోయ: చెరువు గట్టుపై ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందారు. ఈ సంఘటన విశాఖజిల్లా అరకులోయలోని నందివలస గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. స్థానిక అంగన్వాడీలో చదువుకుంటున్న ముగ్గురు చిన్నారులు అంగన్వాడీ కేంద్రం నుంచి ఇంటికి వెళ్తూ.. మార్గమధ్యంలోని చెరువులో పడి మృతిచెందారు. కాగా.. చిన్నారులు గట్టుపై ఆడుకుంటూ వెళ్లి నీటిలో మునిగి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన చిన్నారుల వివరాలు తెలియాల్సి ఉంది. -
చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి
జిల్లాలోని మెరకముడిదాం మండలంలో మంగళవారం ఓ విషాదం చోటుచేసుకుంది. గోపన్న వలసలో చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సెలవుదినం కావడంతో వారందరూ చెరువులో ఈతకు వెళ్లినట్టు స్థానికులు తెలిపారు. ఈతకు వెళ్లిన చిన్నారులు ఇంటికి తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు ఆవేధన వ్యక్తం చేశారు. అయితే చెరువులో పడి మృతిచెందరాని వార్త వినగానే తల్లిదండ్రులు నివ్వేరపోయారు. మృతిచెందిన చిన్నారులు 10 ఏళ్ల లోపు వారే. కాగా, తమ చిన్నారులు తిరిగారాని లోకాలకు వెళ్లిపోయారంటూ తల్లిదండ్రులు కన్నీటపర్యంతమైయ్యారు.