రామగిరి: అనంతపురం జిల్లాలో డెంగీ లక్షణాలతో ఓ చిన్నారి మృతిచెందింది. వివరాలు... రామగిరి మండలపరిదిలోని పేరూరు గ్రామానికి చెందిన లక్ష్మీ, రమాకాంత్‌ల కుమారుడు ధీరజ్‌కుమార్(2) గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. చిన్నారికి జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించగా డెంగీ లక్షణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం చిన్నారి మృతిచెందాడు.