సాక్షి, హైదరాబాద్: నగరంలోని నాగోల్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ వాటర్ ఫౌంటేయిన్‌లో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వివరాలు..కృష్ణా జిల్లా నందిగామ మండలం మునగచెర్ల గ్రామానికి చెందిన గంటా శివాజి, బంధువుల పెళ్లి నిమిత్తం తన కుటుంబసభ్యులతో కలసి నాగోల్‌లోని శుభం కన్వెన్షన్ హాల్‌కు బుధవారం రాత్రి వచ్చారు.
శివాజీ కుమారుడు జితేంద్ర కుమార్(4), సోదరుడి కుమార్తె మనస్విని(5) ఇద్దరూ ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ వాటర్ ఫౌంటేయిన్‌లో పడి మృతి చెందారు. జితేంద్ర తండ్రి శివాజి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment