ప్రొద్దుటూరు: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు లోని ఓ ప్రైవేటు స్కూల్ లో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. స్ధానికంగా ఉండే వాణి స్కూల్ లో చెక్క బీరువా పడి ఓ విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. లింగాపురానికి చెందిన భార్గవి అనే చిన్నారి వాణి స్కూల్ లో నర్సీరీ చదువుతోంది. ఈ రోజు ఉదయం ఆడుకుంటున్న చిన్నారిపై బీరువా పడటంతో తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన చిన్నారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. కాగా , స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల చిన్నారి చనిపోయిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
స్కూల్‌లో బీరువా పడి చిన్నారి మృతి
Published Tue, Jun 28 2016 2:50 PM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM
Advertisement
Advertisement